అమరావతి: అమృత్ మహోత్సవం సందర్భంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ నెల్లూరులోని శ్రీహరికోటలో ఆదివారం ఉదయం చిన్న ఉపగ్రహ వాహక నౌక ఎస్ఎస్ఎల్ వి-డి1 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. 13.2 నిమిషాల్లోనే ఎస్ఎస్ఎల్ వి-డి1 రాకెట్ ప్రయోగం పూర్తైంది. ఈ రాకెట్, ఈఓఎస్-02, ఆజాదీశాట్ ఉపట్రహాలను నింగిలోకి తీసుకెళ్లింది. ఈ ఉపగ్రహాలను తక్కువ ఎత్తులోని సమీప భూకక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇవి మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్ అనుసంధానికి ఉపయుక్తం కానున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
#WATCH ISRO launches SSLV-D1 carrying an Earth Observation Satellite & a student-made satellite-AzaadiSAT from Satish Dhawan Space Centre, Sriharikota
(Source: ISRO) pic.twitter.com/A0Yg7LuJvs
— ANI (@ANI) August 7, 2022
ISRO Successfully Launches SSLV-D1 Rocket