బెంగళూరు: కమర్షియల్ అంతరిక్ష ప్రయోగాలలో అత్యంత ఆవశ్యకమైన సిఇ 20 ఇంజిన్‌ను శనివారం ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. ఫ్లైయిట్ ఆక్సెప్టెన్స్ హాట్ టెస్ట్‌గా పిలిచే ఇంజిన్ పరీక్ష తమిళనాడులోని మహేంద్రగిరిలో ఎతైన ప్రాంతంలో ఉండే ఇస్రో ప్రాపుల్సన్ కాంప్లెక్స్ (ఐపిఆర్‌సి)లో నిర్వహించారు. భారీ బరువు ఉండే రాకెట్లకు వాడే ఈ సిఇ 20 ఇంజిన్ పనితీరు ఏ విధంగా ఉందనేది కీలకమైన అంశం. ఇస్రో తలపెట్టిన మరో 36 శాటిలైట్ల ఒన్‌వెబ్ ఇండియా 1 శాటిలైట్ల ప్రయోగానికి వాడే భారీ స్థాయి వాహక నౌకకు ఇస్రో ఈ ఇంజిన్ ఏర్పాటు చేయాలని ఖరారు చేసుకుంది. ఎల్‌విఎం3ఎం3 మిషన్‌కు ఉపయోగించే ఈ ఇంజిన్ సామర్థ పరీక్ష ఇప్పుడు కీలకమైనదని, ఇందులో విజయం సాధించామని ఇస్రో వర్గాలు తెలిపాయి. లండన్‌కు చెందిన శాటిలైట్ల కమ్యూనికేషన్స్ కంపెనీ ఒన్‌వెబ్‌కు చెందిన 36 శాటిలైట్లను సరైన విధంగా కక్షల్లోకి పంపించేందుకు రంగం సిద్ధం అయింది. ఇస్రో ప్రత్యేకంగా వాణిజ్య పరమైన ప్రయోగాల కోసం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌సిల్) విభాగాన్ని ఏర్పాటు చేసుకుంది. ఎల్‌విఎం 3 నుంచి ఈ శాటిలైట్లను వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలలో ప్రయోగిస్తారు. ఇంజిన్ ఏవిధంగా వాహక నౌకకు అనువుగా ఉంటుంది. ఇబ్బందులు ఏమైనా ఎదురువుతాయా? అనే అంశాలను నిర్థారించుకునే పరీక్ష ఇప్పుడు జరిగిందని ఇస్రో తెలిపింది. ఈ నెల 23న శ్రీహరికోటలోని షార్ నుంచి ఒన్‌వెబ్ శాటిలైట్ల తొలి సీరిస్‌ను ప్రయోగించారు. దీని తరువాత జరిగే సీరిస్ పరీక్షలకు ఇంజిన్ సామర్థం పరీక్షించడం అత్యంత కీలక పరిణామం అయింది.
ISRO Successfully test CE-20 Engine for next mission