Sunday, November 3, 2024

బూస్టర్ రాకెట్ సక్సెస్

- Advertisement -
- Advertisement -

 ISRO successfully tests human-rated HS200

ఇస్రో కేంద్రం నుంచి పరీక్ష
గగన్‌యాన్‌లో ఓ మైలురాయి
నిరంతర ఇంధన జ్వలితం
మానవ మరో యాత్రకు కీలకం

శ్రీహరికోట/న్యూఢిల్లీ : భారతదేశపు ప్రతిష్టాత్మక గగన్‌యాన్ యాత్రలో శుక్రవారం అత్యంత కీలక ఘట్టం పూర్తయింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)రాకెట్ బూస్టర్స్ స్థిర జ్వాలాపరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఇవి సాధారణ ప్రేరక బూస్టర్లు కావు. భారతదేశపు తొట్టతొలి గగన్‌యాత్ర వాహకానికి అవసరం అయిన ఇంధన సౌకర్యం కల్పిస్తాయి. ఈ బూస్లర్లను మండించడం ద్వారా ఏ స్థాయిలో ఇంధనం ఉత్పత్తి అవుతుందనేది ఇప్పుడు అంచనా వేసుకునే పరీక్ష సక్సెస్ అయిందని ఇస్రో వర్గాలు తెలిపాయి. తెల్లవారుజామున నింగిలో ఇవి మిరుమిట్లు గొలిపే కాంతులను వెదజల్లాయి. గగన్‌యాన్ వెహికల్‌ను భూ కేంద్రం నుంచి నింగిలోని కక్షల్లోకి ఈ బూస్టర్లు తీసుకువెళ్లుతాయి. ఈ స్థాయిలో ఇవి మండటం వల్ల ఉత్పత్తి అయ్యే ఇంధనం వినియోగితం అవుతుంది. సంబంధిత బూస్టర్స్ ఫైర్‌టెస్ట్ గగన్‌యాత్రలో వాడే వాహకనౌక సామర్థం దిశలో తొలి దశ అవుతుంది. ఇప్పుడిది విజయవంతం అయిందని ఇస్రో హర్షం వ్యక్తం చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట వద్ద ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ధృఢమైన రాకెట్ బూస్టర్ హెచ్‌ఎస్ 200ను సరిగ్గా ఉదయం 7 గంటల 20 నిమిషాలకు పరీక్షించారని ఇస్రో వర్గాలు తెలిపాయి. జిఎస్‌ఎల్‌వి ఎంకె 3 ఉపగ్రహ వాహక నౌక (దీనినే ప్రముఖంగా ఎల్‌విఎం 3 అని పిలుస్తారు) ప్రయోగానికి విజయవంతంగా పరీక్షించి చూశారు.దీనికి మరింత మెరుగుదిద్దుతూ గగన్‌యాన్ రాకెట్ బూస్టర్స్ ఇప్పుడు సిద్ధం అయ్యాయి. మనుష్యులను అంతరిక్ష యాత్రలకు తీసుకువెళ్లే గగన్‌యాన్ ఇస్రో ప్రతిష్టాత్మక కార్యక్రమం. ఇది పూర్తిగా మానవయుతం. సంబంధిత గగన్‌యాన్‌కు కీలకమైన తొలి దశ ఇప్పుడు విజయవంతం అయింది. ఈ బూస్టర్స్ పనితీరును పూర్తిస్థాయిలో పరీక్షించుకోవడం ముగిసిందని ఇస్రో వర్గాలు తమ ప్రకటనలో తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News