Thursday, December 26, 2024

కొత్త బ్యాటరీ సెల్స్‌కు ఇస్రో టెస్టు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు ప్రక్రియలో ఉన్న ఇస్రో ఈ దిశలో మరో ముందడుగుకు వెళ్లింది. తాము సరికొత్త బ్యాటరీ సెల్స్ అత్యున్నత సామర్థాన్ని పరీక్షించినట్లు ఇస్రో అధికారులు శుక్రవారం తెలిపారు. ఇప్పుడు లభించే బ్యాటరీ సెల్స్‌తో పోలిస్తే వీటి పనితీరు మిన్న అని, పైగా చవక అని కూడా తెలిపారు. ఇస్రో రూపొందించి , వాడక అర్హత దక్కించుకున్న 10 ఎహెచ్ సిలికాన్ గ్రాఫైట్ అనోడేకు చెందిన లై ఐయాన్ సెల్స్ పనితీరు పరీక్ష తరువాత ఫలితాలు బాగున్నాయని నిర్థారించారు. ఇవి తక్కువ బరువుతో ఉండటం, తక్కువ ధరకు అందుబాటులో ఉండటం ప్రత్యేకతలుగా నిలిచాయి. ఇటీవల పిఎస్‌ఎల్‌వి సి 58 రాకెట్ ద్వారా జరిపిన ప్రయోగం దశలోనూ ఈ బ్యాటరీ సెల్స్ సమర్థతను పరీక్షించారు. ఇప్పుడు విడిగా వీటి నాణ్యత పట్ల జరిపిన పరీక్ష వీటి మన్నికను నిర్థారించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News