Sunday, January 19, 2025

ఇస్రో పిఎస్ 4 ఇంజిన్ సక్సెస్

- Advertisement -
- Advertisement -

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తమ పిఎస్ 4 ఇంజిన్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఈ ఇంజిన్‌ను 3 డి ప్రింటెడ్ ఇంజిన్‌గా వ్యవహరిస్తారు. దీని పనితీరును సుదీర్ఘ సమయం పరీక్షించినట్లు, ఎటువంటి లోపాలు లేవని నిర్థారించుకున్నట్లు ఇస్రో అధికారికంగా తెలిపింది. అత్యంత అధునాతన తయారీ విధానాలతో ఈ ఇంజిన్‌ను రూపొందించారు. దీని వల్ల 97 శాతం వరకూ ముడిభాగాలను ఆదా చేయవచ్చు. 60 శాతం మేర తయారీ సమయాన్ని తగ్గించవచ్చు. ఈ సింగిల్ ఇంజిన్‌ను ఎఎం టెక్నాలజీ సాయంతో రూపొందించారు. గురువారం దీని సామర్థాన్ని ఏకంగా 665 సెకండ్ల పాటు పరీక్షించినట్లు ఇస్రో వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News