Friday, December 20, 2024

‘ఫెయిల్యూర్ ఆధారిత విధానం’లో చంద్రయాన్ 3..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: చంద్రుడిపై అన్వేషణలో భాగంగా అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగానికి రంగం సిద్ధమైంది. జులై 14 మధ్యాహ్నం 2.35కి ఎల్‌వీఎం 3 పీ4 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. తాజాగా వీటికి సంబంధించిన తాజా సమాచారాన్ని ఇస్రో అందించింది. చంద్రయాన్ ను సరికొత్త విధానంలో రూపొందించామని వెల్లడించింది. చంద్రయాన్ 2తో పోలిస్తే చంద్రయాన్ 3ని ఫెయిల్యూర్ ఆధారిత విధానంతో అభివృద్ధి చేశామని తెలిపింది. చంద్రయాన్ 2 లో సమస్య ఏమిటనే విషయాన్ని పరిశీలిస్తే … పెరామీటర్ వేరియేషన్ లేదా విభాగాలను వేరు చేసే వ్యవస్థను నిర్వహించే సామర్ధం చాలా పరిమితమే.

అందుకే ఈసారి ఆ సామర్ధాన్ని మరింత పెంచాం. చంద్రయాన్ 2ను సక్సెస్ ఆధారిత మోడల్ లోరూపొందించగా, చంద్రయాన్ 3 లో మాత్రం ఫెయిల్యూర్ ఆధారిత డిజైన్‌ను అమలు చేస్తున్నాం. ఏదైనా వ్యవస్థ విఫలమైనప్పుడు దాన్ని ఎలా రక్షించాలనే విధానమే ఇది’ అని ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ వెల్లడించారు. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న చంద్రయాన్ 3 జులై 14న నింగిలోకి దూసుకెళ్ల నుంది. సుమారు 3. 84 లక్షల కిమీ సుదీర్ఘ ప్రయాణం తరువాత ఆగస్టు 23 లేదా 24 తేదీల్లో జాబిల్లిపై చంద్రయాన్ 3 అడుగుపెట్టనుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంలోని నిర్దేశిత ప్రదేశంలో ఈ రోవర్‌ను దించేందుకు ఇస్రో ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.

Also Read: ఉత్తరాదిలో జల ప్రళయం.. గ్రామాలను ముంచెత్తున్న వరదలు(వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News