Monday, January 6, 2025

సూర్యుడిపై అధ్యయనానికి ఇస్రో సిద్ధం

- Advertisement -
- Advertisement -

ఇస్రో మరో ఘనతను సాధించేందుకు సిద్ధమైంది. ఈసారి ఏకంగా సూర్యుడిపైనే అధ్యయనం చేసేందుకు సిద్ధమైంది. ఈమేరకు కమర్షియల్ మిషన్‌లో ఇస్రో పాలుపంచుకుంటోంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ‘ప్రోబా 3’ మిషన్‌లో భాగంగా ఇస్రో డిసెంబర్ 4 న రెండు ఉపగ్రహాలను అంతరిక్షం లోకి పంపనుంది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పిఎస్‌ఎల్‌వీ ద్వారా ఈ ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఈ పిఎస్‌ఎల్‌వీ సి59 /ప్రోబా 3 మిషన్‌లో… కరోనా గ్రాఫ్ స్పేస్‌క్రాఫ్ట్ (సిఎస్‌సి) , ఓకల్టర్ స్పేస్ క్రాఫ్ట్ (ఒఎస్‌సి) అనే రెండు అంతరిక్ష నౌకలు ఉంటాయి. ఈ రెండింటి బరువు సుమారు 550 కిలోలు. వీటిని ‘స్టాక్డ్ కాన్ఫిగరేషన్’లో అంటే ఒకదానిపై మరొకటి అమర్చి రెండింటినీ కలిపి ఒకేసారి ప్రయోగించనున్నారు. ఈమేరకు బుధవారం సాయంత్రం 4.06 గంటలకు ఈ రెండు శాటిలైట్లను ప్రయోగించనున్నట్టు ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ ప్రయోగం కోసం ఇస్రో తన అత్యంత విశ్వసనీయమైన , సమర్ధవంతమైన పిఎస్‌ఎల్‌వి (పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ) రాకెట్ xl వెర్షన్‌ను ఉపయోగిస్తోంది. ఇస్రో దగ్గర ఉన్న మొత్తం ఐదు పిఎస్‌ఎల్‌వి వేరియంట్స్‌లో ఇది మోస్ట్ పవర్‌ఫుల్ రాకెట్. ఈ రాకెట్ సాధారణ పిఎస్‌ఎల్‌వి కంటే చాలా శక్తివంతమైనది. ఎందుకంటే సాధారణ పిఎస్‌ఎల్‌వి రాకెట్ 4 బూస్టర్లను మాత్రమే ఉండగా, ఇది 6 పెద్ద బూస్టర్లను కలిగి ఉంటుంది. దీని ఒక్కో బూస్టర్ 12 టన్నుల ప్రొపెల్లెంట్ (రాకెట్‌కు ఫ్యూయెల్ వంటిది) క్యారీ చేయగలదు. పిఎస్‌ఎల్‌వి xl రాకెట్ అనేది భారత దేశపు మొట్టమొదటి లిక్విడ్ ఫేజ్ వెహికల్. ఇది ఫ్యూయల్ , లిక్విడ్ ఫ్యూయల్ రెండింటినీ ఉపయోగించుకుంటుంది. ఈ రెండు రకాల ఫ్యూయల్స్ కలయిక వల్ల రాకెట్‌కు అదనపు శక్తి లభిస్తుంది. దీంతో ఇది నార్మల్ పిఎస్‌ఎల్‌వి రాకెట్ కంటే ఎక్కువ బరువున్న శాటిలైట్లను అంతరిక్షం లోకి తీసుకెళ్ల గలదు. ఇది న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ మిషన్. దీన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఇఎస్‌ఎ) అభివృద్ధి చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News