Sunday, January 19, 2025

గగనపు ఎక్స్‌రేల వేటలో 2024కు ఇస్రో వినూత్న స్వాగతం

- Advertisement -
- Advertisement -

2024 కు ఇస్రో వినూత్న స్వాగతం
పిఎస్‌ఎల్‌వి సి58 ప్రయోగం నేడే
కక్షలోకి అత్యంత కీలక ఎక్స్‌పోశాట్
అంతరిక్షంలోని ఎక్స్‌రేలపై అధ్యయనం
ఎక్స్‌రే మూలాలపై వినూత్న పరిశీలన
పాతిక గంటల కౌంట్‌డౌన్ ఆరంభం

శ్రీహరికోట : నిరుటి ప్రయోగవిజయాల స్ఫూర్తితో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కొత్త సంవత్సరం 2024కు సరికొత్త ప్రయోగాలతో స్వాగతానికి సిద్ధం అయింది. విశ్వం అంతరిక్ష వీధుల్లోని అంతుచిక్కని సృష్టి రహస్యాల పాలపుంతలు లేదా బ్లాక్‌హోల్స్‌పై విశేష రీతిలో అధ్యయనానికి కౌంట్‌డౌన్‌కు దిగింది. కొత్త సంవత్సర ఆరంభం సోమవారం నాడే ఇస్రో తొట్టతొలి ఎక్స్ రే పొలారిమీటర్ శాటిలైట్ (ఎక్స్‌పోశాట్)ను తమ పరీక్షల నమ్మినబంటు పిఎస్‌ఎల్‌వి రాకెటు నుంచి సోమవారం ప్రయోగించనుంది.

సబంధిత 25 గంటల కౌంట్‌డౌన్ ప్రక్రియ ఆదివారం ఉదయం 8.10 గంటలకు ఆరంభం అయిందని ఇస్రో వర్గాలు తెలిపాయి. పిఎస్‌ఎల్‌వి సి 58 వాహకనౌక ద్వారా ఈ అత్యంత విశిష్టమైన ఎక్స్‌పోశాట్‌నుకక్షలోకి పంపించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అంతకు ముందటి చంద్రయాన్ తరువాత అక్టోబర్‌లో గగన్‌యాన్ సంబంధిత డి1 ప్రయోగం విజయం తరువాత ఇస్రో చేపట్టే తొలి పరీక్ష ఇదే, పైగా 2024 ఆరంభంలోనే ఇప్పుడు ఈ ప్రయోగాన్ని ప్రతిష్టాత్మకంగా మలుచుకున్నారు. 2024 విజయాలకు నాంది ప్రస్తావనగా ఈ వినూత్న శాటిలైట్‌ను కక్షలోకి పంపించనున్నారు. ఇక రాకెట్ పిఎస్‌ఎల్‌వి సి58కు ఇది 60వ ప్రయోగం అవుతుంది.

సోమవారం నాటి ప్రయోగంలో ఈ శాటిలైట్ ప్రధాన పేలోడ్‌గా ఉంటుంది. తోడుగా మరో 10 ఉపగ్రహాలు కూడా ఉంటాయి. వీటిని తక్కువ భూ కక్షల్లోకి పంపిస్తారు. ఆదివారం కౌంట్‌డౌన్ ముగింపు తరువాత సోమవారం ఉదయం 9.30 ప్రాంతంలో శ్రీహరికోట అంతరిక్షరేవు కేంద్రం నుంచి దీనిని ప్రయోగిస్తారు. భూ కక్ష దాటిన తరువాతి అంతరిక్ష పొరల్లోని దట్టమైన సాంద్రతాయుత ఎక్స్ రే వనరులను అధ్యయనం చేసేందుకు , బ్లాక్‌హోల్స్‌లోని జీవపదార్థాల పరిశీలనలకు ఈ యాత్ర కీలకం అవుతుంది. ఇప్పుడు ఇస్రో చేపట్టే ఇటువంటి ప్రయోగాలను అమెరికాకు చెందిన నాసా కూడా చేపట్టింది. 2021 డిసెంబర్‌లో ఎక్స్‌రే పొలారిమెట్రీ అన్వేషణకు దిగింది.

దీనికి భిన్నంగా ఇప్పుడు ఇస్రో తరఫున అంతరిక్షంలోని ఎక్స్ రే నిక్షిప్తాలపై మరింత లోతైన అధ్యయనం జరుగుతుంది. ఇప్పుడు చేపట్టే ఎక్స్‌పోశాట్ జీవితకాలం ఐదేళ్లుగా ఉంటుంది. సాధారణంగా ఎక్స్‌రే సముదాయం అత్యంత శక్తివంతం. వీటిలో విద్యుత్ అయస్కాంత తరంగాలు ఇమిడి ఉంటాయి. ఇవి అత్యధిక ఇంధన శక్తితో ఉండటం, స్వల్ప స్థాయి వేవ్‌లెన్త్‌తో ఉండటం వల్ల ఎటువంటి పదార్థం లోకి అయినా చొచ్చుకుని పోయి అంతర్గత అంశాల విశ్లేషణలో తోడ్పడుతాయి. ఖగోళంలో ప్రత్యేకించి బ్లాక్‌హోల్స్‌లో ఉండే అపార విద్యుత్ అయస్కాంత క్షేత్రాలు, కిరణాలపై ఇప్పటి శాటిలైట్ దృష్టిసారిస్తుందని వెల్లడించారు.

ఇప్పటి పిఎస్‌ఎల్‌వి ప్రయోగంలో పది పేలోడ్స్
వీటిలో హైదరాబాద్ ధృవస్పేస్ నానోశాటిలైట్
సోమవారం కొత్త ఏడాది నేపథ్యంలో ఇస్రో తలపెట్టిన పిఎస్‌ఎల్‌వి సి58 ప్రయోగానికి మరో ప్రత్యేకత ఉంది. ఈ రాకెట్ ద్వారా భారతదేశానికి చెందిన నాలుగు పేలోడ్లను కూడా కక్షలోకి పంపిస్తారు. మైక్రోశాటిలైట్ ఉపవ్యవస్థల పనితీరును ఈ క్రమంలో పరీక్షించుకుంటారు. ఇక శాటిలైట్లను సరైన కక్షల్లోకి పంపించేందుకు వీలుగా పనిచేసే థ్రస్టర్స్ లేదా చిన్నపాటి ఇంజిన్ల సామర్థతను కూడా ఈ పేలోడ్స్ ద్వారా కక్షలోకి పంపించి నిర్థారిస్తారు. హైదరాబాద్‌కు చెందిన ధృవ స్పేస్ తమ పి 30 నానోశాటిలైట్ వేదిక సమర్థతను పరీక్షించుకుంటుంది.

తాము త్వరలో తలపెట్టే పలు రకాల భూ పర్యవేక్షణ, అధ్యయనాలు, ఐఒటి సొల్యూషన్స్‌కు సంబంధించి ఇప్పటి నానోశాటిలైట్ పేలోడ్ కక్షలోకి పంపించి , సమర్థతను పరీక్షించుకునేందుకు ఈ పేలోడ్ అవసరం అని ధృవ స్పేస్ కార్యనిర్వాహక అధికారి సంజయ్ నెక్కంటి తెలిపారు. బెంగళూరుకు చెందన బెల్లాట్రిక్‌స ఏరోస్పేస్ , ముంబైకి చెందిన సంస్థ , ఐఐటి బొంబాయి రూపొందించిన ఇన్‌స్పెసిటి స్పేస్ లాబ్స్, హైదరాబాద్‌కే చెందిన టేక్‌మీ2 స్పేస్ లాబ్స్ సంస్థకు చెందిన పేలోడ్స్ కూడా సోమవారం నాటి రాకెట్‌కు అనుసంధానం అయ్యి ఉన్నాయి.

పేలోడ్‌ల అమరికతో కూడిన ప్రక్రియను పొయెమ్ అని వ్యవహరిస్తారు.ఈ నాలుగు అనుసంధాన స్టార్టప్ సహా మొత్తం మీద ఈ రాకెట్ నుంచి పది వరకూ పేలోడ్స్ కక్షలోక వెళ్లుతాయి. తిరువనంతపురంలోని మహిళల ఎల్‌బిఎస్ టెక్నాలజీ సంస్థ తయారీ అయిన విశాట్ ద్వారా సోలార్ ఇరెడియన్స్, యువి ఇండెక్స్ అధ్యయనం జరుగుతుంది. ముంబైకి చెందిన కెజె సోమయ ఇనిస్టూట్ నుంచి అమేచ్యూర్ రేడియో శాటిలైట్ బిలీఫ్‌శాట్ 0 పేలోడ్‌గా ఉంటుంది. అహ్మదాబాద్‌కు చెందిన ఫిజికల్ రిసర్చ్ లాబ్‌కు చెందిన డెక్స్ పేలోడ్ నుంచి ఖగోళ పదార్థాల నడుమ ఉండే ధుమ్మూధూళికణాల పరిశీలన జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News