Sunday, December 22, 2024

అన్ని పేలోడ్ లక్ష్యాలను పూర్తి చేసిన ఇస్రో పి.ఒ.ఇ.ఎం3

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : ఇస్రోకు చెందిన వినూత్న అంతరిక్ష వేదిక పి .ఒ. ఇ .ఎం (పిఎస్‌ఎల్‌వి ఆర్బిటల్ ఎక్స్‌పెరిమెంటల్ మాడ్యూల్ 3) తన తొమ్మిది పేలోడ్ లక్షాలను విజయవంతంగా పూర్తి చేయగలిగిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శనివారం వెల్లడించింది. పిఎస్‌ఎల్‌వి సి58 ఎక్స్‌పోశాట్ ను ఈ నెల 1న ప్రయోగించిన సంగతి తెలిసిందే . విక్రమ్ శారాభాయ్ అంతరిక్ష కేంద్రం నుంచి తొమ్మిది పేలోడ్‌లతో పిఒఇఎం3 గగనతలం లోకి దూసుకెళ్లిందని ఇస్రో పేర్కొంది. 25 వ రోజు నాటికి పిఒఇఎం3 400 ప్రదక్షిణలను పూర్తి చేసిందని , ఈ గమన కాలంలో అనుకున్న లక్షం ప్రకారం ప్రతి పేలోడ్‌ను ఆపరేషన్‌లో పెట్టడమే కాక, నిర్వహించగలిగిందని వివరించింది. పిఒఇఎం అన్నది మూడు అక్షాలతో కూడిన నియంత్రణ వేదిక. విద్యుత్ ఉత్పత్తి, టెలికమాండ్, టెలిమెట్రీ ఈ మూడు సామర్థాలు ఇందులోఉన్నాయి.

ఇవే పేలోడ్‌లకు సహకరిస్తాయి. ఇది తిరిగి భూ వాతావరణం లోకి ప్రవేశించే ముందు మరో 73 రోజుల పాటు కక్షలో పరిభ్రవిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో అంతరిక్షంలో ఎలాంటి శిధిలాలను విడిచిపెట్టడం ఉండబోదని ఇస్రో పేర్కొంది. ఈ పేలోడ్‌ల్లో బెంగళూరు కేంద్రంగా ఉన్న బెల్లట్రిక్స్ నుంచి ఎఆర్‌కెఎ 200, రుద్ర, ద్రువ స్పేస్ నుంచి ఎల్‌ఇఎపి టిడి పరీక్షలు పూర్తయ్యాయి. ఇదే విధంగా కెజె సొమాయియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి డబ్లుఇసాట్ కోసం రెగ్యులర్‌గా పేలోడ్ డేటా సేకరించడమై ంది. టేక్ మి 2 స్పేస్ నుంచి ఆర్‌ఎస్‌ఇఎమ్ (రేడియేషన్ షీల్డింగ్ ప్రయోగం) , పిఆర్‌ఎల్ నుంచి ప్రతి కక్షకు అంతర్గ్రహ ధూళి కణాల ప్రయోగం నిర్వహించడమైంది. పిఒఇఎం1, పిఒఇఎం2 మిషన్ల తాలూకు అన్ని పేలోడ్ లక్షాలను నెరవేర్చమైనట్టు ఇస్రో వెల్లడించింది. వివిధ సంస్థలకు పరిశ్రమలకు చెందిన మొత్తం 21 పేలోడ్‌లతో ఈ రాకెట్ బయలుదేరింది. ఈ విజయం తరువాత భవిష్యత్ మిషన్ల కోసం పిఒఇఎం3 తో మరిన్ని ప్రయోగాలు చేయనున్నట్టు ఇస్రో వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News