Friday, November 22, 2024

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

- Advertisement -
- Advertisement -

తిరుపతి: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) భారీ రాకెట్ ఎల్‌విఎం3 ఆదివారం సతీశ్ ధావన్ స్పేస్ స్టేషన్ నుంచి విజయవంతంగా ప్రయోగించబడింది. ఇది యూకెకు చెందిన వన్ వెబ్ గ్రూప్ తాలూకు 36 ఉపగ్రహాలను నింగికి తీసుకెళ్ళింది. ఇది న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్‌కు రెండో మిషన్. శనివారం ఉదయం 8.30 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. 24.30 గంటల కౌంట్‌డౌన్ తర్వాత ఆదివారం ఉదయం 9.00 గంటలకు ప్రయోగం మొదలయింది. ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ శుక్రవారం రాత్రి ‘షార్’కు చేరుకుని రాకెట్ ప్రయోగాన్ని సమీక్షించారు. ఆయన ఆధ్వర్యంలోనే శనివారం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News