Friday, January 3, 2025

డాకింగ్‌లో తొలి అడుగు

- Advertisement -
- Advertisement -

టార్గెట్, ఛేజర్ ఉపగ్రహాలను
నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టిన
పిఎస్‌ఎల్‌విసి60 వాహకనౌక
అంతరిక్షంలోనే రెండు ఉప
గ్రహాల డాకింగ్, అన్ డాకింగ్
జనవరి 4న ప్రక్రియ
షార్‌లో సంబురాలు అమెరికా,
రష్యా, చైనా సరసన భారత్

మన తెలంగాణ/హైదరాబాద్: అంతరిక్ష పరిశోధళనల్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ముందడుగు వేసింది. సోమవారం శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి చేపట్టిన పీఎస్‌ఎల్వీ-సీ60 ప్రయోగం సక్సెస్ అయింది. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన వాహకనౌక టార్గెట్, ఛేజర్ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. సరిగ్గా రాత్రి 10 గంటల 15 సెకెన్లకు మొదటి ప్రయోగవేదిక నుంచి పీఎస్‌ఎల్వీ-సీ60 రాకెట్ 2 ఉపగ్రహాలతో దూసుకెళ్లింది. స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ (స్పేడెక్స్) పేరిట జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో అనుసంధానం చేసే బృహత్తర ప్రయోగాన్ని ఇస్రోA చేపట్టింది. డాకింగ్, అన్ డాకింగ్ చేసే అత్యంత సంక్లిష్టమైన టెక్నాలజీ అభివృద్ధే లక్ష్యంగా ఈ మిషన్ చేపట్టారు.

పీఎస్‌ఎల్వీ ద్వారా ప్రయోగించిన రెండు చిన్న వ్యోమ నౌకలను అంతరిక్షంలోనే ఒకదానితో ఒకటి డాకింక్ చేయించడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ఆ టార్గెట్, ఛేజర్ ఉపగ్రహాల బరువు 440 కిలోలు ఉంటుందని ఇస్రో వెల్లడించింది. డాకింగ్ ప్రక్రియకు మరో వారం పడుతుందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. అంతరిక్షంలోనే ఉపగ్రహాలను డాకింగ్, అన్‌డాకింగ్ చేసేలా చేపట్టిన ఈ ప్రయోగం భూ ఉపరితలం నుంచి 470 కి.మీ. ఎత్తులో జరగనుంది. జనవరి 4న రెండు ఉపగ్రహాలను దగ్గరకు తీసుకువచ్చే ప్రక్రియ ప్రారంభమవుతుంది.

పరస్పరం ఢీకొనకుండా రెండు శాటిలైట్ల మధ్య కమ్యూనికేషన్ అనుసంధానం జరుగుతుంది. ఆ తరువాత 2 ఉపగ్రహాలను డాకింగ్, అన్ డాకింగ్ చేస్తారు. అనంతరం సాధారణ ఉపగ్రహాల్లా వేర్వేరుగా అంతరిక్ష పరిశీలన చేస్తారు. డాకింగ్, అన్ డాకింగ్ ప్రక్రియ విజయవంతమైతే అమెరికా, రష్యా, చైనా తరువాత ఈ టెక్నాలజీ సాధించిన నాలుగోదేశంగా భారత్ అవతరించనుంది. చంద్రుడిపై వ్యోమగామిని దించడం, జాబిల్లి నుంచి మట్టిని తీసుకురావడం, 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రం నిర్మించాలన్న భారత్ కల సాకారం కావాలంటే వ్యోమ నౌకల డాకింగ్, అన్ డాకింగ్ సాంకేతికత ఎంతో అవసరం. అందుకే ఈ ప్రయోగం ఇస్రోకు ఎంతో కీలకంగా మారింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News