- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : తిరుమల నడక మార్గంలో దివ్యదర్శనం టోకెన్ల జారీని టిటిడి శనివారం నుంచి పునప్రారంభించింది. కొవిడ్ నేపధ్యంలో గత మూడు సంవత్సరాలుగా టిటిడి దివ్యదర్శనం టోకెన్ల జారీని నిలిపివేసింది. అయితే భక్తుల కోరిక మేరకు అలిపిరి నడక మార్గంలో గాలిగోపురం వద్ద 10వేలు, శ్రీవారి మెట్ల మార్గంలో 1250మెట్టు వద్ద 5వేల టోకెన్లను కేటాయించటాన్ని ప్రారంభించారు. భక్తులు నేరుగా తమ ఆధార్ కార్డుతో హాజరైతేనే టోకెన్లు జారీ చేస్తారు. టిటిడి కొద్దిరోజులపాటు ప్రయోగాత్మకంగా దివ్వదర్శనం టోకెన్ల జారీని పరిశీలించనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టోకెన్లు పొందాలని టిడిడి ప్రజాసంబంధాల అధికారి నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు.
- Advertisement -