Wednesday, January 22, 2025

ఎల్‌ఎల్‌ఆర్ లెర్నింగ్ లైసెన్స్‌ల పంపిణీ

- Advertisement -
- Advertisement -

జహీరాబాద్: జహీరాబాద్ నియోజకవర్గంలో డ్రైవిం గ్ లైసెన్స్ లేని యువతకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలనే సదుద్దేశంతో జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు మెగా ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 6వేల మందికి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, మంగళవారం 100 మంది యువతీ, యువకులు లెర్నింగ్ లైసెన్స్ దృవపత్రాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… లైసెన్స్ పొందాలంటే చాలా సమయం వేచిఉండాలనే కారణంతో చాలా మంది తీసుకోవడానికి నిర్లక్షం చేస్తున్నారని, ఇలా అనేక మంది అనుకొని ప్రమాదాల్లో తమ ప్రాణాలను పొగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రోడ్డు నియమ నిబంధనలు తెలియజేస్తూనే ప్రమాద రహిత సమాజాన్ని నిర్మించాలనే సంకల్పంతో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ పంపిణీ మేళా వంటి మహత్తర కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. వాహనాలు నడిపే ప్రతి వ్యక్తి దగ్గర లైసెన్స్ ఉండాలనే లక్షంతో సొంత ఖర్చుతో డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇకపై ప్రతి రోజు 150 లెర్నింగ్ ధృవపత్రాలను ఇవ్వడం జరుగుతుందన్నారు. రోజువారీగా కొంతమందికి డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన ఎల్‌ఎల్‌ఆర్ ధృవపత్రాలు అందించడం జరుగుతుంది. రానివారు ఎవరు అధైర్యపడకుండా త్వరలో ప్రతిఒక్కరికి అందిస్తామని ఎమ్మెల్యే అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News