- Advertisement -
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు కనీస మార్కులు వేసినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఇంటర్ బోర్డు వెబ్‌సైట్ ద్వారా రేపటి నుంచి మెమోలు డౌన్లోడ్ చేసుకోచ్చని పేర్కొంది. దీంతో ఫెయిలైన విద్యార్థులు రీకౌంటింగ్. రీ వెరిఫికేషనికి చెల్లించిన ఫీజును వెనక్కి తీసుకొనే అవకాశం లభించింది. ఈ నెల 17 వరకు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ దరఖాస్తు రద్దుకు అవకాశం కల్పించినట్లు బోర్డు తెలిపింది. చెల్లించిన ఫీజును ఫిబ్రవరి 1 నుంచి కళాశాలల్లో తీసుకోవాలని విద్యార్థులకు సూచించింది.
- Advertisement -