Monday, December 23, 2024

రాహుల్ గాంధీ పాస్‌పోర్ట్ జారీకి కోర్టు పచ్చ జెండా!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: త్వరలో అమెరికా పర్యటించనున్న రాహుల్ గాంధీకి ఢిల్లీ కోర్టు ఊరట కల్పించింది. ఆయనకు కొత్త పాస్‌పోర్టు కోసం ‘నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్’(ఎన్‌ఓసి) కోరుతూ ఆయన పెట్టుకున్న అభ్యర్థనను సానుకూలంగా పరిశీలించింది. అంతేకాక మూడేళ్ల కాలానికి ‘నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్’ జారీ చేసింది. దీంతో రాహుల్ గాంధీ కొత్త పాస్‌పోర్ట్ పొందేందుకు మార్గం సుగమం అయింది.
‘మోడీ ఇంటిపేరున్న వారంతా దొంగలే’ అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యకు ఆయనపై పార్లమెంటులో అనర్హత వేటు పడింది. దౌత్య హోదా పాస్‌పోర్ట్‌ను ఆయన అధికారులకు అప్పగించేశారు. ఇప్పుడాయన కొత్త సాధారణ పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే బిజెపి నేత సుబ్రమణ్యస్వామి ఫిర్యాదు చేసిన ‘నేషనల్ హెరాల్డ్ కేసు’లో రాహుల్ నిందితుడు. ఈ కేసులో రాహుల్ 2015 నుంచి బెయిల్‌పై ఉన్నారు.

రెండు రోజుల క్రితం ఢిల్లీ కోర్టు విచారణ జరిపింది. బెయిల్ మంజూరు సమయంలో రాహుల్‌పై ఎలాంటి ప్రయాణ ఆంక్షలు విధించలేదని పేర్కొంది. కాగా, సుబ్రమణ్యస్వామి రాహుల్ ఎన్‌ఓపి పిటిషన్‌ను వ్యతిరేకించారు. రాహుల్‌కు పాస్‌పోర్ట్ మంజూరయితే అది ‘నేషనల్ హెరాల్డ్ కేసు’పై ప్రభావం చూపుతుందని వాదించారు. అయితే అభ్యంతరాలను లిఖిత పూర్వకంగా సమర్పించాలని కోర్టు స్వామిని ఆదేశించింది. తర్వాత విచారణను వాయిదా వేసింది. శుక్రవారం విచారణ చేపట్టిన కోర్టు సుబ్రమణ్య స్వామి వాదనను తిరస్కరించింది. రాహుల్‌కు ఎన్‌ఓసి ఇచ్చేందుకు కోర్టు అంగీకరించింది. అయితే రాహుల్ కోరినట్లు పదేళ్లకు కాకుండా మూడేళ్లకు ఎన్‌ఓసిని జారీ చేసింది. దీంతో రాహుల్ గాంధీ కొత్త పాస్ పోర్టు పొందే అవకాశం ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News