Thursday, January 23, 2025

రోజుకో మలుపు

- Advertisement -
- Advertisement -

ధర్మారం: దొంగతుర్తి గ్రామ పంచాయతీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. గ్రామ పంచాయతీ నిధుల్ని స్వప్రయోజనాలకు వాడుకున్నారని వార్డు సభ్యులు ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టర్ విచారణ జరిపించి సర్పంచ్ పాలకుర్తి సత్తయ్య గౌడ్, కార్యదర్శి మహేందర్‌ను సస్పెన్షన్ చేయడంతో పాటు ఉపసర్పంచ్ ముత్యాల చంద్రశేఖర్ చెక్ పవర్‌ను రద్దు చేశారు. తాజాగా రెండు రోజుల క్రితం ఎంపీఓ ఆధ్వర్యంలో కార్యదర్శి, వార్డు సభ్యులతో సమావేశం నిర్వహించి ఇద్దరు సభ్యులను సంతకాలు చేసేందుకు తీర్మాణం చేశారు. వ్యవహారం ముదిరి చిలికి చిలికి గాలివానగా మారింది. ఇక్కడ రాజకీయపరంగా ఉన్న గ్రూపు విబేధాలు దొంగతుర్తి గ్రామపంచాయతీ రోడ్ ఎక్కించాయి.

గ్రామ పంచాయతీ సమావేశం నిర్వహించిన సందర్భంలో ఉప సర్పంచ్ బాధ్యతలు రాకముందే సర్పంచ్ కుర్చీలో ఉప సర్పంచ్ కూర్చోవడం వివాదస్పదంగా మారి సర్పంచ్ పాలకుర్తి సత్తయ్య గౌడ్ జిల్లా కలెక్టర్‌కు బుధవారం ఫిర్యాదు చేశారు.ఓ వైపు సర్పంచ్‌తో పాటు ఉపసర్పంచ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం న్యాయ స్థానం సైతం తమకు స్టే ఇచ్చిందని వారు చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు అధికారికంగా స్టే ఉత్తర్వులు రాకపోయినప్పటికీ సర్పంచ్, ఉపసర్పంచ్‌కు న్యాయ స్థానం స్టే మంజూరు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. దొంగతుర్తి గ్రామపంచాయతీ వ్యవహారం ఇక్కడి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల మద్య విబేధాలతో ఒకరిపై ఒకరు ఆరోపణలు సందించుకోవడం, విమర్శలు చేసుకోవడం పట్ల దొంగతుర్తి ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది.

ఇప్పుడు ధర్మారం మండల కేంద్రంతోపాటు జిల్లా వ్యాప్తంగా దొంగతుర్తి గ్రామపంచాయతీపై తీవ్ర చర్చ నడుస్తుంది. అభివృద్ధి కోసం పోటీ పడాల్సింది పోయి తమకు వ్యక్తిగతంగా ఉన్న విబేధాలతో ఒకరిపై ఒకరు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసుకోవడం చివరికి సస్పెన్షన్‌కు గురి కావడం, చెక్ పవర్ రద్దు కావడం ఒక్కొక్కటి ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళుతున్నాయి. దొంగతుర్తి గ్రామం ఇప్పటికే అభివృద్ధిలో మంచి పురోగతిలో ఉండగా, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి నిధులు విడుదల చేయడం, స్థానిక మండల స్థాయి ప్రజాప్రతినిధులు సహకారం అందిస్తున్నప్పటికీ స్థానికంగా విబేధాలు గ్రామపంచాయతీని రోడ్ ఎక్కించాయి. రోజుకో వివాదం రోజుకో మలుపుతో ఇప్పుడు ఎక్కడ చూసిన దొంగతుర్తి గ్రామపంచాయతీ వ్యవహారంపై చర్చ నడుస్తుంది. ఈ వ్యవహారంలో అధికారుల పాత్ర వివాదస్పదం కావడం కొసమెరుపు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News