Saturday, December 21, 2024

గృహలక్ష్మిపథకంలో వికలాంగుల రిజర్వేషన్ అమలుపై జిఓ 33 జారీ

- Advertisement -
- Advertisement -
ఎన్‌పిఆర్‌డి హర్షం

హైదరాబాద్ : సొంతిల్లు లేని నిరుపేదలకు ఇల్లు నిర్మించుకోవడానికి ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకంలో వికలాంగులకు రిజర్వేషన్ అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం జిఓ 33 జారీ చేయడం పట్ల వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ విడుదల చేసిన . జిఓ నెంబర్ 25 లో వికలాంగులకు ఎలాంటి రిజర్వేషన్స్ ప్రకటించలేదని, ఈ జిఓను సవరించి వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కి వినతిపత్రం ఇచ్చిన విషయాన్ని ఎన్‌పిఆర్‌డి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.వెంకట్, ఎం. అడివయ్య, కోశాధికారి ఆర్. వెంకటేష్‌లు గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. తమ పోరాటాల ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చిందని మంత్రి ఆరోజు సానుకూలంగా స్పందించి ఇప్పుడు సవరించిన జిఓ విడుదల చేశారని వారన్నారు. ఈ జిఓ ప్రకారం లబ్ధిదారుల ఎంపికలో వికలాంగులకు 5 శాతం కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వంపేర్కొన్నట్లు తెలిపారు. జిఓ ప్రకారం లబ్ధిదారుల ఎంపికలో ఐదు శాతం వికలాంగులకు కేటాయించే విధంగా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News