Monday, December 23, 2024

గ్రూప్ 1 ప్రిలిమినరీ హాల్ టిక్కెట్లు జారీ

- Advertisement -
- Advertisement -

Issue of Group 1 Preliminary Hall Tickets

మనతెలంగాణ/ హైదరాబాద్ : టిఎస్‌పిఎస్‌సి నిర్వహిస్తున్న గ్రూప్- 1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. హాల్‌టికెట్లను పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వైబ్ సైట్‌లో పొందుపరిచి, ప్రత్యేక లింక్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 503 గ్రూప్ -1 ఉద్యోగాల కోసం మొత్తం 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబర్ 16నఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అన్ని జిల్లా కేంద్రాలలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. జనవరి లేదా ఫిబ్రవరిలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. అభ్యర్థులందరూ చివరి నిమిషంలో రద్దీని నివారించడానికి చాలా ముందుగానే హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని కమిషన్ కోరింది. అభ్యర్థులు హాల్ టికెట్‌లో, వెబ్‌సైట్‌లో అందించిన మార్గదర్శకాలు, సూచనలను అనుసరించాలని ఆదేశించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News