Wednesday, January 22, 2025

కారుణ్య నియామక పత్రాల అందజేత

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెం సింగరేణి : సింగరేణి ప్రధాన కార్యాలయం జీఎం (పర్సనల్), వెల్ఫేర్ అండ్ ఆర్‌సి ఛాంబర్‌లో కార్పోరేట్ ఏరియా ఈ ఆర్‌పి డిపార్ట్‌మెంట్‌లో జనరల్ మజ్దూర్గా పనిచేస్తూ మరణించిన ఎల్లబోయిన సమ్మయ్య కుమారుడు ఈ, హిమవంత్‌కి బుధవారం కారుణ్య నియామకం కోసం జీఎం (పర్సనల్) వెల్ఫేర్ అండ్ ఆర్‌సి కె. బసవయ్య ఉద్యోగ నియామక ఉత్తర్వుని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్, సిఅండ్‌ఎండి ఎన్.శ్రీధర్ ఆదేశాల మేరకు నియామకాలల్లో భాగంగా ఒకరికి నియామక పత్రం అందజేశామని తెలిపారు.

సంస్థలో ఉద్యోగం పొందడం చాలా అద్టృం అని , నీతి నిజాయితీ క్రమశిక్షణ, నిబద్దతతో ఎల్లప్పుడు రక్షణ సూత్రాలు పాటిస్తూ, విధులకు గైర్హాజరు కాకుండా పై అధికారుల ఆదేశాలు అమలు చేస్తూ సంస్థ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. విద్యా అర్హతల ప్రకారం అంతర్గతంగా కూడా చాలా అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. నియామక పత్రం అందుకున్న డిపెండెంట్ మాట్లాడుతూ కారుణ్య ఉద్యోగం పొందినందుకు సీఎం, సిఅండ్‌ఎండి, ఉత్తర్వులు అందజేసిన జీఎం పర్సనల్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏజీఎం (పర్సనల్) కె. శ్రీనివాసరావు, సీనియర్ పివో సుశీల్ కుమార్, వెల్ఫేర్ పిఏ వర ప్రసాద్, సీనయర్ అసిస్టెంట్‌లు స్వప్ననీల్, అజీజ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News