Friday, January 24, 2025

నేను మోనార్క్..నన్నెవరు ఏమీ చేయలేరు

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ : ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన ఫించన్ దారులు, పాత్రికేయుల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెల్‌నెస్ కేంద్రం నిర్లక్షం అనే జబ్బు నుంచి ఇంకా కోలుకోవడం లేదు. ఈ సెంటర్‌లో జరిగే తతంగంపై పత్రికల్లో వార్తలు వచ్చినా, కలెక్టర్ లాంటి ఉన్నతాధికారులు తనఖీలు చేసినా అవేవి ఇక్కడ అమలు కావడం లేదు. దీంతో వెల్‌నెస్ కేంద్రం చుట్టుపు చూపుగానే ఉందన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

గతంలో వెల్‌నెస్ కేంద్రంలో విధుల్లో జరుగుతున్న బోగస్ అటెండెన్స్, వైద్య పనితీరు, మందులు వంటి వాటిపై మన తెలంగాణ పత్రికల్లో వచ్చిన కథనాలపై జిల్లా కలెక్టర్ వెంకట్రావ్ తనిఖీలు చేసి సిబ్బందిపైన, ఇంచార్జీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సరైన వైద్య సేవలు అందించాలని, పేషెంట్లకు కావాల్సిన మందులను సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి తెప్పించి మందుల కొరత తీర్చాలని, ఇసిజి మిషన్‌ను బాగు చేయాలని, డెంటల్ ఎక్సరేను మరమ్మత్తులు చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ఇక్కడి ఇంచార్జి నిర్వాకం వలన కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్‌గా మారుతున్నాయని బాధిత ఫించన్ దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ తనఖీలు చేసినప్పటికీ సెంటర్‌లో ఏ మాత్రం మార్పులు లేక పోవడం గమనార్హం. ఫించన్ దారులు , విలేకర్లలో అనేక మంది తీవ్ర ఒత్తిడితో గుండె జబ్బులకు గురి అవుతుంటారు. వీరికి గెండెకు సంబందించిన ప్రాధమిక పరిక్ష చేయాలంటే ఇసిజి అవసరం . అయితే ఇక్కడ ఇసిజి మిషన్ ఉన్నా మూలన పడేశారు. అయితే కలెక్టర్ గుర్తించి వాటి మరమ్మత్తుకు సైతం రూ. 10 వేలకు పైగా నిధులు విడుదల చేసినట్లు సమాచారం.

అయితే ఆ నిధులు ఏమయ్యాయో తెలియడం లేదు. దీంతో ఇక్కడ గుండెకు సంబందించిన జబ్బలతో వచ్చే వారికి బయటికి రాస్తున్నారు. దీంతో వృద్దులు అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయట ఇసిజి తీసుకొస్తున్నారు. ఇక్కడ అవసరమైన మందులు, వైద్య పరికరాలు వాటిపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాల్సింది పోయి తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
ఆహా ఏమి వైద్యం ః
ఫించన్ దారుల,ఉద్యోగులు, పాత్రికేయుల ఆరోగ్యంను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ సెప్టెంబర్ 7న 2018 లో కలెక్టరేట్ ఆవరణంలో ఈ వెల్‌నెస్ కేంద్రంను ప్రారంభించారు. ఇద్దరు డెంటల్, ఇద్దరు ఫిజియో తెరిఫిస్టులు, ఒక ఫిజీషియన్, ఇద్దరు ఎంబిబిఎస్ డాక్టర్లతో పాటు వైద్య సిబ్బంది, నర్సులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించారు. మొదట్లో బాగానే ఉన్నా తర్వాత ఇంఛార్జీల మూలంగా వెల్‌నెస్ కేంద్రంలో రోగుల వైద్యంను గాలికి వదేలేశారు. వెల్‌నెస్ సెంటర్‌లో డెంటల్ విభాగం ప్రారంభమై నాలుగేళ్ల కాలంలో కేవలం 5200 మంది పేషెంట్లు మాత్రమే ఇక్కడ వైద్యం తీసుకున్నారు. అలాగే ఫిజియో తెరిఫీకి కేవలం ఈ నాలుగేళ్లలో 1700 మంది పేషెంట్లు మాత్రమే వైద్యం పొందినట్లు తెలుస్తోంది.

ఒక్క ఫిజీషియన్ డాక్టర్, ఇద్దరు ఎంబిబిఎస్ డాక్టర్లు మినహా, డెంటల్ డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధుల్లో ఉండాల్సి ఉంటుంది. ప్రతి రోజు అటెండెన్స్‌లో సంతకాలు పెట్టి హైదరాబాద్‌కు ఆరోగ్య శ్రీ ఇంచార్జి జెఇఓకు వాట్సప్ మెస్సేజ్‌ను హెర్‌ఆర్‌కు పంపాల్సి ఉంటుంది. కాని ఇక్కడ గతంలో విధులకు రాకున్నప్పటికీ వచ్చినట్లు ఇతరులతో సంతకాలు పెట్టించి పంపే వారు . ఈ సంఘటనపై విచారణకు ఆదేశించినా హైదరాబాద్ అదికారులు సైతం హెచ్చిరించినా మార్పలు లేవు. ఇప్పటికీ విధుల విషయంలో డెంటల్ డాక్టర్లు నిర్లక్షంగానే వ్యవహరిస్తునారనే వాదనలు ఉన్నాయి.
రోగులనే దబాయిస్తున్న ఇంఛార్జీ ః
వెల్‌నెస్ సెంటర్‌కు వచ్చే సీనియర్ సిటిజన్, పదవీ విరమణ పొందిన ఉద్యోగులపైనే ఇంచార్జీ దబాయింపులకు పాల్పడుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. కనీసం వయస్సుకు విలువ ఇవ్వకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. పదవీ విరమణ పొందిన మల్లు రామచంద్రారెడ్డి, ఎక్సైజ్ శాఖలో పదవీ విరమణ చేసిన ఆకుల శేఖర్‌లు ఇంచార్జీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  వైద్యం కోసం వెళ్లిన తమపై ఇష్టాను సారంగా మాట్లడుతోందని చెప్పారు. కనీస మర్యాద లేకుండా మాట్లాడడంపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News