Wednesday, January 22, 2025

టిఎస్ ఆర్‌టిసిలో పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలి

- Advertisement -
- Advertisement -

ఆర్‌టిసి తెలంగాణ మజ్దూర్ యూనియన్

మన తెలంగాణ / హైదరాబాద్: దీర్ఘకాలంలో పెండింగ్‌లో అనేక ఆర్‌టిసి సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ఏ. రామచంద్రారెడ్డి, ఎమ్. థామస్ రెడ్డి ఆర్‌టిసి ఎండికి సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు సోమవారం బస్‌భవన్‌లో ఆర్‌టిసి ఎండి సజ్జనార్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు.

గత నాలుగు సంవత్సరాలుగా చట్టబద్దత లేని వెల్ఫేర్ కమిటీలను ఏర్పాటు చేసిన కార్మికులపై ఉక్కుపాదం మోపుతున్నారని, ఎంటిడబ్ల్యూ యాక్ట్‌కు విరుద్ధంగా అన్ని డిపోలలో నిర్భంద ఉద్యోగం చేయిస్తున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. పని ఒత్తిడిని తట్టుకోలేక డ్రైవర్లు స్టీరింగ్‌లపైనే ప్రాణాలు కోల్పోవడం, కండక్టర్‌లు బస్‌లలో ప్రాణాలు కోల్పోయిన సంఘటలను అనేకం ఉన్నాయన్నారు. కార్మికుల సమస్యలపై అనేక వినతి పత్రాలు సమర్పించినా వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న 2017, 2021 పిఆర్‌సి, 11 డిఏ( డియరెన్స్ అలవెన్స్) మంజూరు చేయాలని, 2013కు సంబంధించిన 50 శాతం డబ్బులను వెంటనే చెల్లించాలన్నారు. ప్రస్తుతం ఉన్న చట్టబద్దత లేని వెల్ఫేర్ కమిటీలను రద్దు చేసి ట్రేడ్ యూనియన్స్ పునరుద్ధరించాలని, ప్రస్తుతం ఆర్‌టిసిలో అన్ని విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే రిక్రూట్ చేసి, కొత్త బస్సులను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా సిసిఎస్, పిఎఫ్‌ల బకాయిలను వెంటనే చెల్లించాలని ,హయ్యర్ పెన్షన్ కోసం సర్వీసులో ఉన్న ఆర్‌టిసి ఉద్యోగులకు వారి ఖాతా నుంచే పిఎఫ్ జమచేయాలన్నారు.తార్నాకలో ఆసుపత్రిల్లో మెరుగైన వైద్యం అందిచేందుకు రెఫరల్ ఆసుపత్రులను రాష్ట్ర వ్యాప్తంగా పెంచాలని. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోలలో టిమ్ మిషన్‌ల సమస్య తీవ్రంగా ఉందని వెంటనే కొత్త వాటిని కొనుగోలు చేయాలని వారు ఆర్‌టిసి ఎండి సజ్జనార్‌కు ఇచ్చిన వినతిపత్రంలో కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News