Monday, January 20, 2025

‘లైఫ్‌స్టైల్ పికప్’ మోడల్‌లను విడుదల చేసిన ఇసుజు మోటర్స్ ఇండియా

- Advertisement -
- Advertisement -

చెన్నై: శక్తివంతమైన మరియు ఔత్సాహిక భారతీయ వినియోగదారులకు, జీవనశైలి స్ఫూర్తిని పెంచేందుకు ఆకర్షణీయమైన ఉత్పత్తి శ్రేణిని అందించే ప్రయత్నంలో, ఇసుజు తన సుసంపన్నమైన వ్యక్తిగత ప్యాసింజర్ పికప్‌లను పరిచయం చేసింది, ఇవి భారతదేశం కోసం భారతదేశంలో తయారు చేయబడినవి. భారతదేశంలో మార్గదర్శకంగా ఉన్న జీవనశైలి పిక్-అప్ విభాగంలో ట్రెండ్‌ను సెట్ చేయడానికి ఇసుజు నిబద్ధతను నేటి ఆవిష్కరణ వెల్లడిస్తుంది.

సరికొత్త వి -క్రాస్ 4×4 టాప్ వేరియంట్‌లు ఎక్సటెరియర్ ల పరంగా సొగసైనప్పటికీ ఇంకా క్లాస్సి ఎలిమెంట్‌లను కలిగి ఉండి, ఆకర్షణీయతను పెంచుతాయి. ముదురు బూడిద రంగులో స్టైలింగ్ అంశాలు ఫినిషింగ్ కలిగి ఉండటం తో ఈ కాలాతీత ఆకర్షణ సాధించబడింది. ఇవి సూక్ష్మమైనప్పటికీ విజువల్ డైనమిజమ్‌ని మరియు వైవిధ్యమైన రోడ్ ఉనికిని కలిగి ఉండటం చేత ఈ వాహనాలు మరింత దూకుడుగా కనిపించినప్పటికీ ఇంకా స్పోర్టీగా ఉంటాయి.

డజనుకు పైగా సాహసోపేత స్టైలింగ్ ఎలిమెంట్‌ల ను కలిగి ఉండటంతో, ‘సైబోర్గ్ – ఓర్కా’ స్ఫూర్తితో తీర్చిదిద్దబడిన వాహనం యొక్క అసలు డిజైన్‌కు, ఒక ప్రత్యేక క్యారెక్టర్ ను జోడిస్తుంది.

ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ డిసెంట్ కంట్రోల్ (HDC) మరియు హిల్ స్టార్ట్ అసిస్ట్ (HSA) యొక్క యాక్టివ్ సేఫ్టీ సిస్టమ్స్ ఇప్పుడు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మోడల్‌లలో ప్రవేశపెట్టబడ్డాయి. రోడ్డుపై పట్టు కోల్పోతున్న చక్రాన్ని గుర్తించిన తర్వాత ఆటోమేటిక్‌గా బ్రేక్‌లు వర్తింప జేసే ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్స్ (TCS), రోడ్డు ట్రాక్షన్ కోల్పోవడం వల్ల వాహనం బయటకు వెళ్లకుండా నిరోధించడంలో సహాయపడే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ఓవర్-స్పీడ్‌ను నివారించడానికి వాహన పరిధిని 4 నుండి 30 కి.మీ/గం గా నిర్వహించే హిల్ డిసెంట్ కంట్రోల్ , వాలు వైపు డ్రైవింగ్ చేసేటప్పుడు మరియు ఆ సమయం లో వెనుక ఢీకొనే అవకాశాలను తగ్గించే హిల్ స్టార్ట్ అసిస్ట్ తోడ్పడతాయి.

V-క్రాస్ 4×4 టాప్ వేరియంట్‌లపై మెరుగుపరిచిన స్టైలింగ్ ఎలిమెంట్స్

· ఫ్రంట్ బంపర్ గార్డ్
· ఫ్రంట్ గ్రిల్
· ఇంజిన్ హుడ్ గార్నిష్
· ORVMలు
· రూఫ్ రైల్స్
· రియర్ కాంబో లాంప్ గార్నిష్
· రియర్ బంపర్
· ఫెండర్ లిప్స్
· బ్లాక్ వీల్స్
· బ్యాడ్జ్ & డెకాల్

ఇసుజు ప్యాసింజర్ పికప్ లైనప్ శ్రేణి ఇప్పుడు యాక్టివ్ సేఫ్టీ సిస్టమ్‌ల యొక్క మొత్తం సూట్‌ను కలిగి ఉంది, వాటిని డిమాండ్ చేసే ప్రతికూల పరిస్థితుల్లో మరింత ఖచ్చితమైన నియంత్రణ మరియు డ్రైవబిలిటీని అందిస్తాయి.

పాసివ్ సేఫ్టీ సిస్టమ్‌ను మెరుగుపరచడం కోసం, అన్ని ప్యాసింజర్ పికప్ మోడల్‌లు ఇప్పుడు ‘రియర్ సీట్ ఆక్యుపెంట్ డిటెక్షన్ సెన్సార్‌లు’తో వస్తాయి మరియు ‘వెనుక సీటులో ఉన్న ప్రతి ముగ్గురికి 3-పాయింట్ సీట్ బెల్ట్’ని ప్రామాణికంగా కలిగి ఉన్నాయి. అదనంగా, డ్యాష్‌బోర్డ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ క్లస్టర్‌లో ఐకాన్‌గా వెనుక సీటులో ఉన్నవారి కోసం సీట్ బెల్ట్ హెచ్చరిక సూచిక ఉంది. ఇది ప్రతి ఒక్కరూ తమ సీటు బెల్ట్‌ను ధరించేలా డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది, తద్వారా ప్రయాణాన్ని అందరికీ సురక్షితంగా చేస్తుంది.

మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ప్యాసింజర్ పికప్ మోడల్‌లలో జోడించబడిన కొత్త భద్రతా ఫీచర్లు
· ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS)
· ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC)
· హిల్ డిసెంట్ కంట్రోల్ (HDC)
· హిల్ స్టార్ట్ అసిస్ట్ (HSA)

కస్టమర్‌లకు ప్రత్యేకించి వెనుక సీటులో ఉన్నవారికి ఆనందాన్ని పంచే మరో ముఖ్యమైన ఆకర్షణ , అన్ని ప్యాసింజర్ పికప్ మోడల్‌లలో వెనుక సీటులో ఉన్నవారికి మెరుగైన సౌకర్యాన్ని అందించడం. సీటింగ్ డిజైన్ మార్పుతో, వెనుక సీట్లు ఇప్పుడు మరింత సౌకర్యవంతమైన సీటింగ్ భంగిమను తీసుకువచ్చే రీతిలో అధిక స్థాయి వంపుని అందిస్తాయి.

ఈ ఆవిష్కరణ పై ఇసుజు మోటర్స్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ టోరు కిషిమోటో మాట్లాడుతూ, “భారతదేశంలో మొట్టమొదటి లైఫ్‌స్టైల్ అడ్వెంచర్ యుటిలిటీ వెహికల్, మా ప్యాసింజర్ వాహనాల శ్రేణి పికప్‌లను అందించడంలో బెంచ్‌మార్క్ సెట్ చేసినందుకు మేము గర్విస్తున్నాము. విడుదల చేసినప్పటి నుండి నిలకడగా ఇవి వినియోగదారుల నడుమ మంచి ఆదరణ పొందాయి. ఈ సక్సెస్ స్టోరీని ముందుకు తీసుకెళ్లడం సంతోషంగా ఉంది. ఈ సుసంపన్నమైన ఆకాంక్షాత్మక ఉత్పత్తులతో, అభివృద్ధి చెందుతున్న ప్రగతిశీల భారతీయ కస్టమర్ల అవసరాలను తీర్చగలమని మరియు ఈ విభాగంలో మా స్థానాన్ని మరింత బలోపేతం చేయగలమని మేము విశ్వసిస్తున్నాము. తాజా శ్రేణి ఇసుజు ప్యాసింజర్ పికప్‌లు మా విలువైన కస్టమర్‌లకు అత్యుత్తమ డిజైన్, పనితీరు, వైవిధ్యత , నాణ్యత, భద్రత మరియు డ్రైవింగ్ సౌకర్యాలతో విలువ ప్రతిపాదనను నిజంగా మెరుగుపరుస్తాయి…” అని అన్నారు.

కొత్త వెనుక సీటు ఆక్యుపెంట్ సేఫ్టీ ఫీచర్లు
· వెనుక సీటు ఆక్యుపెంట్ డిటెక్టర్ సెన్సార్లు
· వెనుక సీటులో ఉన్న మొత్తం ముగ్గురికి 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు
· డాష్‌బోర్డ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ క్లస్టర్‌లో సీట్ బెల్ట్ హెచ్చరిక సూచిక చిహ్నం

ఉత్తేజకరమైన ఉత్పత్తి శ్రేణి, కఠినమైన మరియు మన్నికైన ఆఫ్-రోడింగ్ సామర్థ్యం, వైవిధ్యత మరియు పాసెంజర్ వాహనాల లాంటి సౌకర్యాల కలయికతో భారతదేశంలో పిక్-అప్ సంస్కృతి యొక్క స్ఫూర్తిని రేకెత్తించే ‘లైఫ్‌స్టైల్ వెహికల్’ యొక్క పెరుగుతున్న అవసరాన్ని తీర్చనున్నాయి. అత్యుత్తమ పనితీరు మరియు విశ్వసనీయతను అందించే ఇసుజు యొక్క లెజెండరీ ఇంజినీరింగ్ అత్యుత్తమ శ్రేణి సామర్ధ్యం మరియు పనితీరు అందిస్తుంది.

కస్టమర్‌లు సమీప ఇసుజు డీలర్ అవుట్‌లెట్‌కు కాల్ చేయవచ్చు లేదా మరింత వివరణాత్మక ఉత్పత్తి సమాచారం మరియు టెస్ట్ డ్రైవ్‌ను బుక్ చేసుకోవడానికి https://www.isuzu.inని సందర్శించవచ్చు. మరింత సమాచారం కోసం 1800 4199 188 (టోల్ ఫ్రీ)ని కస్టమర్ లు సంప్రదించవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News