ఇసుజు మోటార్స్ ఇండియా, శ్రీసిటి ఆంద్రప్రదేశ్ వద్ద ఉన్న తన స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ తయారీ సదుపాయము నుండి ఒక లక్ష వాహనాల రోల్ అవుట్ సాధించిన మైలురాయిని ప్రకటించింది. ఈ ముఖ్యమైన విజయము భారతీయ మార్కెట్ పట్ల ఇసుజు యొక్క నిబద్ధతను నొక్కి ఉద్ఘాటిస్తుంది. దేశములోని ఆటోమోటివ్ మార్కెట్ లో పెరుగుతున్న తన ఉనికిని ప్రతిబింబిస్తుంది. ఒక లక్ష వాహనాల మైలురాయి సాధించడం అనేది తన మన్నిక, విశ్వసనీయత కొరకు నమ్మకం మరియు గుర్తింపు ఉన్న ప్రముఖ ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ మాడల్ యొక్క రోల్ అవుట్ తో గుర్తించబడింది.
డా. ఎన్. యువరాజ్, ప్రభుత్వ సెక్రెటరీ, పరిశ్రమలు కామర్స్ & ఆహార ప్రక్రియ విభాగము, ఆంధ్రప్రదేశ్ ఈ వేడుకలో ముఖ్య అతిధి. డా. రవీంద్ర సన్నారెడ్డి, వ్యవస్థాపకుడు & ఎండి, శ్రీ సిటి, మకోటో సాడో, చెయిర్మెన్, శ్రీ సిటి జపనీస్ కంపెనీ గ్రూప్ ఈ వేడుకలో గౌరవ అతిథులు.
ఇసుజు మోటార్స్ ఇండియా తన కార్యకలాపాలను 2016లో శ్రీ సిటిలో తన తయారీ సదుపాయాన్ని స్థాపించడం ద్వారా ప్రారంభించింది. తయారీ కార్యకలాపాలలో సహోత్తేజనం తీసుకొని వచ్చిన ఈ కంపెనీ స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ ప్రెస్ షాప్ సదుపాయము మరియు ఇంజన్ అసెంబ్లీ ప్లాంట్ ప్రారంభోత్సవముతో 2020లో తన ఫేజ్-II కార్యకలాపాలను ప్రారంభించింది. అప్పటి నుండి, ఈ సదుపాయము నుండి 14,00,000 పైగా ప్రెస్డ్ భాగాలు రోల్ చేయబడ్డాయి.
పెరుగుతున్న మార్కెట్ డిమాండ్ ఆధారంగా, ఇసుజు మోటార్స్ ఇండియా తన వాహనము మరియు ఇంజన్ ఉత్పత్తిని గత రెండు సంవత్సరాలలో రెట్టింపు చేసింది, తద్వారా ఇసుజు పేరుగాంచిన నాణ్యత స్థాయిలకు కట్టుబడి ఉంటూ వినియోగదారుడి మారుతున్న అవసరాలను స్వీకరించే కంపెనీ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. తన దీర్ఘ-కాలిక ‘మేక్ ఇన్ ఇండియా’ వ్యూహముతో సమలేఖనం చేస్తూ, ఇసుజు మోటార్స్ ఇండియా దేశీయ మార్కెట్ కొరకు తన కార్యకలాపాలను బలోపేతం చేసింది మరియు ప్రపంచవ్యాప్తంగా ఇసుజు యొక్క ఫుట్ ప్రింట్స్ విస్తరించటానికి దోహదపడింది.
తన అభిప్రాయాలను పంచుకుంటూ రాజేష్ మిట్టల్, ప్రెసిడెంట్ & మేనేజింగ్ డైరెక్టర్, ఇసుజు మోటార్ ఇండియా, ఇలా అన్నారు, “ఇసుజు మోటార్స్ ఇండియాలో, భారతదేశములో మా ప్రయాణము విషయములో మేము గర్విస్తున్నాము. కొన్ని సంవత్సరాలుగా, ఉత్పత్తి మరియు ఎగుమతులలో కంపెనీ ముఖ్యమైన మైలురాళ్ళను సాధించింది. ఒక కీలకమైన ప్రాధాన్యత ఏమిటంటే, మా ఉత్పత్తి లైన్ శ్రామికశక్తి లో 22% ప్రతిభావంతులైన మహిళలు ఉన్నారు. ఇది భిన్నత్వము మరియు చేరికలను పెంచాలనే మా నిబద్ధతను ప్రదర్శిస్తుంది అదనంగా, మా ఉత్పత్తి శ్రామికశక్తిలో 100% మంది డిప్లొమా ఇంజనీలు మరియు వాళ్ళు ఇసుజు తయారీ మరియు కార్యాచరణ ఉత్కృష్టత యొక్క అదే ప్రపంచస్థాయి ప్రమాణాలకు లోబడి ప్రపంచ-స్థాయి వాహనాలను తయారు చేస్తారు. దీనితో మేము ఇండియా నుండి వాణిజ్య వాహనాల ఎగుమతిదారుగా నిలిచాము. మేము అభివృద్ధి చెందుతుండగా, మేము భారతదేశములో మరియు విదేశీ మార్కెట్లో అత్యధిక స్థాయి నాణ్యత కలిగిన ఉత్పత్తులు మరియు సేవలను అందించుటకు అంకితభావం కలిగి ఉంటాము.”
ఈ సందర్భములో వ్యాఖ్యానిస్తూ తోరు కిషిమోటో, డెప్యూటి మేనేజింగ్ డైరెక్టర్, ఇసుజు మోటార్స్ ఇండియా, ఇలా అన్నారు “ఈ మైలురాయిని సాధించడం అనేది ఇండియాలో తయారుచేయబడిన అత్యధిక నాణ్యత కలిగిన విశ్వసనీయమైన మరియు బహుముఖమైన ఉత్పత్తుల వాహనాలను అందించుటలో మా వినియోగదారులు మాపై ఉంచే నమ్మకానికి ఒక ప్రామాణికము. ఇది మాకు ఒక గర్వకారణమైన క్షణము మరియు ఇసుజుకు అపారమైన సంభావ్యత మరియు వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉన్న భారతదేశ మార్కెట్ కు మా తిరిగులేని నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. మేము మా వినియోగదారుల సంతోషం కోసం విలువ-ఆధారిత, విశ్వసనీయమైన మరియు వినూత్మ మొబిలిటి సొల్యూషన్స్ అందించుటపై దృష్టి కేంద్రీకరిస్తాము.”
ఉత్పత్తిని పెంచడానికి తోడు, ఇసుజు మోటార్స్ ఇండియా ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా తన చేరికను గణనీయంగా విస్తరించింది. ముందుకు సాగుతూ, కంపెనీ ఒక అంతరాయ లేని యాజమాన్య అనుభవము కొరకు బ్రాండ్ ను తన వినియోగదారులకు చేరువ చేయుట కొరకు తన టచ్ పాయింట్స్ ను పెంచుటకు చూస్తొంది.