Thursday, January 23, 2025

ఉత్పత్తి శ్రేణిని ఆధునీకరించిన ఇసుజు మోటర్స్‌ ఇండియా..

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఇసుజు మోటర్స్‌ ఇండియా తమ మొత్తం శ్రేణి పికప్‌ వాహనాలు, ఎస్‌యువీలను ఆధునీకరించడంతో పాటుగా నూతన బీఎస్‌ 6 ఫేజ్‌ 2 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్థారిస్తుంది. తమ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను సమూలంగా ఆధునీకరించడంతో పాటుగా ఎంపిక చేసిన మోడల్స్‌కు నూతన ఫీచర్లను జోడించింది. ఈ ఉత్పత్తులు మెరుగైన శైలి, భద్రత, సౌకర్యం, సమర్థత, ఉద్గార ప్రమాణాలను అందిస్తాయి. ISUZU D-MAX V-Cross Z 4X2 AT వేరియంట్‌ ఇప్పుడు తమ శైలిని మరింతగా పెంచుకుంది. ప్రకాశవంతమైన నూతన రంగు వెలెన్సియా ఆరెంజ్‌ను వ్యక్తిగత వాహన శ్రేణి కలర్‌ ప్యాలెట్‌కు జోడించారు.

ఇసుజు డీ–మ్యాక్స్‌ రెగ్యులర్‌ క్యాబ్‌ మరియు ఎస్‌–క్యాబ్‌ మోడల్స్‌లో A-SCR (యాక్టివ్‌ సెలెక్టివ్‌ క్యాటలిస్ట్‌ రిడక్షన్‌) ఉంది. దీనిని ఆఫ్టర్‌ ట్రీట్‌మెంట్‌ డివైజెస్‌ సెట్‌కు జోడించారు. దీనిలో LNT (Lean NOx Trap), DPD (Diesel Particulate Diffuser) కూడా ఉంటాయి. ఇవి ప్రభావవంతంగా ఉద్గార వాయువులు, పార్టిక్యులేట్‌ మ్యాటర్‌ (పీఎం)ను నిర్వహిస్తాయి. ఇసుజు డీ–మ్యాక్స్‌ రెగ్యులర్‌ క్యాబ్‌, ఎస్‌–క్యాబ్‌ మాత్రమే ఈ విభాగంలో ఎలకా్ట్రనికల్‌గా నియంత్రించబడిన హాట్‌, కోల్డ్‌ ఈజీఆర్‌ (ఎగ్జాస్ట్‌ గ్యాస్‌ రీసర్క్యులేషన్‌)ను ఆప్టిమల్‌ ట్రీట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ కోసం కలిగిన వాహనాలుగా నిలిచాయి.

ఈ రెండు మోడల్స్‌, వాటి వేరియంట్లు ఇప్పుడు అడ్వాన్స్‌డ్‌ ఎంఐడీ (మల్టీ ఇన్‌ఫర్మేషన్‌ డిస్‌ప్లే) క్లస్టర్‌ను సిల్వర్‌ ఇన్సర్ట్స్‌తో కలిగి ఉంది. ఇది డీపీడీ (డీజిల్‌ పార్టిక్యులేట్‌ డిఫ్యూజర్‌)ఇండికేటర్‌ను ప్రదర్శిస్తుంది. లెవల్‌ సూచించడానికి సబ్‌–మెనూ, ఆటోమేటిక్‌ రీజనరేషన్‌ లేదా మాన్యువల్‌ రీజనరేషన్‌ కార్యకలాపాల కోసం డ్రైవర్‌ను ఆప్రమప్తం చేయడం చేస్తుంది. నూతన సబ్‌ మెనూ డీఈఎఫ్‌ (డీజిల్‌ ఎగ్జాస్ట్‌ ఫ్లూయిడ్‌) కోసం రేంజ్‌ లెవల్‌ ఇండికేషన్‌ ప్రదర్శిస్తుంది. ఖాళీ అయ్యేందుకు ఫ్యూయల్‌ రేంజ్‌, ఇన్‌స్టెంట్‌ /యావరేజ్‌ మైలేజీ సైతం చూపుతుంది. దీనిలో జీఎస్‌ఐ (గేర్‌ షిప్ట్‌ ఇండికేటర్‌) సైతం ఉంది. ఇది ఎలాంటి డ్రైవింగ్‌ పరిస్ధితిలలో అయినా వినియోగించడానికి అత్యంత అనుకూలమైన గేర్‌ ఏది అనేది చూపుతుంది. తద్వారా టార్క్‌, ఫ్యూయల్‌ మేనేజ్‌మెంట్‌, డ్రైవ్‌ట్రైన్‌ మన్నికకు భరోసా అందిస్తుంది.

భద్రత మెరుగుపరచడం కోసం, ఇసుజు డీ–మ్యాక్స్‌, ఎస్‌–క్యాబ్‌ మోడల్స్‌ వేరియబల్‌ స్పీడ్‌ ఇంటర్మిటెంట్‌ విండ్‌షీల్డ్‌ వైపర్‌ సిస్టమ్‌తో వస్తుంది. దీనిద్వారా వర్షపు పరిస్థితిలలో అత్యధిక విజిబిలిటీకి భరోసా అందిస్తుంది. కమర్షియల్‌ వాహన శ్రేణి మరింత సమగ్రవంతంగా ఇసుజు డీ–మ్యాక్స్‌ సూపర్‌ స్ట్రాంగ్‌ సింగిల్‌క్యాబ్‌ ఫ్లాట్‌ డెక్‌లో ఏసీ వేరియంట్స్‌, క్యాబ్‌ ఛాసిస్‌ మోడల్స్‌ పరిచయం చేసింది. అంతేకాదు, ఇసుజు డీ–మ్యాక్స్‌ ఎస్‌–క్యాబ్‌ శ్రేణి ఇప్పుడు నౌటిలస్‌ బ్లూ, కాస్మిక్‌ బ్లాక్‌ లో లభ్యమవుతుంది. ఇవి ఇప్పటికే ఉన్న స్ల్పాష్‌ వైట్‌, టైటానియం సిల్వర్‌, ఒబ్సిడియన్‌ గ్రేలు ఇసుజు డీ–మ్యాక్స్‌ రెగ్యులర్‌ క్యాబ్‌ శ్రేణిలో లభ్యమవుతాయి.

వీటి యొక్క విస్తృత శ్రేణి డిజైన్‌, సాటిలేని విశ్వసనీయతతో, ఇసుజు డీ–మ్యాక్స్‌, డీ–మ్యాక్స్‌ ఎస్‌ క్యాబ్‌లు పనితీరు మాత్రమే కాకుండా ఆధారపడతగిన వాహనం కోరుకునే కొనుగోలుదారులకు ఖచ్చితమైన సమ్మేళనంగా నిలుస్తాయి. ఇసుజు డీ–మ్యాక్స్‌ మరియు డీ–మ్యాక్స్‌ ఎస్‌ –క్యాబ్‌ వాహనాలు అత్యధిక మన్నిక కలిగి ఉండటంతో పాటుగా 40 లక్షల కిలోమీటర్లకు పైగా కఠిన పరీక్షలు చేశారు. విభిన్న భూభాగాలలో వీటిని పరీక్షించడం వల్ల అభివృద్ధి చెందుతున్న భారతీయ వినియోగదారులకు అత్యంత ప్రాధాన్యతా భాగస్వామిగా రోడ్‌పై నిలుస్తుంది.

ఆహ్లాదీకరించబడిన ప్యాసెంజర్‌ పికప్‌, ఎస్‌యువీ మోడల్స్‌ ఇప్పుడు (ఐఎస్‌ఎస్‌) ఐడెల్‌ స్టాప్‌ సిస్టమ్‌, లో ఫ్రిక్షన్‌ టైర్లు, ఆటో ట్రాన్స్‌మిషన్‌ ఫ్లూయిడ్‌ వార్మర్‌ (ఏటీ ఫ్లూయిడ్‌) వంటివి ఆటోమేటిక్‌ వేరియంట్లలో ఉండటంతో పాటుగా మెరుగైన ఇంధన సామర్ధ్యం, తగ్గించబడిన ఉద్గార స్ధాయిల కోసం తోడ్పడతాయి.ISUZU mu-X మోడల్స్‌ ఇప్పుడు నూతనంగా డిజైన్‌ చేసిన స్పోర్టీ గ్రిల్‌తో వస్తుంది. ఇది ఆగి ఉన్నప్పటికీ రోడ్డుపై డైనమిజం ప్రదర్శిస్తుంది.

ఇసుజు హై–ల్యాండర్‌ మోడల్‌లో ఇంటిగ్రేటెడ్‌ కంట్రోల్స్‌తో క్లైమెట్‌ కంట్రోల్‌ ఏసీ, రియర్‌ డీఫాగ్గర్‌ ఉన్నాయి. ఇసుజు డీ–మ్యాక్స్‌ వీ –క్రాస్‌ లో కూడా ఇవి ఉంటాయి. వీటిని అదనపు సౌకర్యం, సౌలభ్యం కోసం జోడించారు. పర్సనల్‌ పికప్‌ విభాగంలో ప్రవేశించాలని కోరుకునే ఔత్సాహిక అర్బన్‌ వినియోగదారులకు పికప్‌ ఛాయిస్‌గా నిలుస్తుంది.

The ISUZU D-MAX V-Cross Z (4×2 AT) వేరియంట్‌, దాని ప్రత్యేక గుర్తింపును జోడించే అనేక లక్షణాలతో తమ స్టైల్‌ కోషెంట్‌ను పెంచుతుంది. ఇది ఇప్పుడు నూతన డిజైన్‌ బ్లాక్‌ అల్లాయ్‌ వీల్స్‌, డార్క్‌ గ్రే ఓఆర్‌వీఎం, ఫ్రంట్‌ ఫాగ్‌ ల్యాంప్‌ గార్నిష్‌తో వస్తుంది. ఇది క్లాసీ మరియు ఎలగెంట్‌ లుక్‌ అందిస్తుంది. ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన సీట్లు ఇప్పుడు కేఫ్‌ బ్రౌన్‌ ఇన్సర్ట్స్‌తో ప్రీమియం బ్రౌన్‌ డ్యూయల్‌ టోన్‌ సీట్‌ అప్‌హోలెస్ట్రీతో దీని డ్యూయల్‌ టోన్‌ డ్యాష్‌ బోర్డ్‌ మరియు డోర్‌ ప్యానెల్స్‌ మరియు గ్రే సెలెక్టర్‌ లీవర్‌తో వస్తుంది.

సౌకర్యం మరియు సౌలభ్యం పరంగా ఇది క్రూయిజ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ను ఈజీ సెలెక్ట్‌ కంట్రోల్స్‌ను స్టీరింగ్‌ వీల్‌పై కలిగి ఉంటుంది. ఇది డ్రైవ్‌ చేసేందుకు మరింత ఆహ్లాదకరమైన అనుభూతులను అందిస్తుంది.

భద్రత, రక్షణ పరంగా మరో దశకు తీసుకువెళ్తూ V-Cross Z (4X2 AT)మోడల్‌ ఇప్పుడు ట్రాక్షన్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ (టీసీఎస్‌) కలిగి ఉంటుంది. ఇది స్వయంచాలకంగా బ్రేక్స్‌ను రోడ్డుపై చక్రం పట్టుకోల్పోతుందనుకునేటప్పుడు అప్లయ్‌ చేస్తుంది. రోడ్డుపై ట్రాక్షన్‌ కోల్పోయినప్పుడు వాహనం తిరగబడకుండా నివారించడంలో ఎలకా్ట్రనిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌ (ఈఎస్‌సీ) తోడ్పడుతుంది. కొండలపై నుంచి దిగుతున్నప్పుడు వాహనం అధిక వేగం అందుకోకుండా నిరోధిస్తూ 4 నుంచి 30 కిలోమీటర్లు/గంట శ్రేణిలో ప్రయాణించేందుకు హిల్‌ డీసెంట్‌ కంట్రోల్‌ తోడ్పడితే, హిల్‌ స్టార్ట్‌ అసిస్ట్‌, వాలు రోడ్లపై వెనుక వైపు వాహనాలతో ప్రమాదాలు జరుగకుండా తగ్గిస్తుంది.

నూతన రంగు వాలెన్సియా ఆరెంజ్‌, మరింత ప్రకాశాన్ని యాగ్రెసివ్‌ డిజైన్‌ భాషను వ్యక్తిగత వాహన శ్రేణికి అందిస్తుంది. ఇప్పుడు దీనిలో 8 రంగులు ఉండటం వల్ల ఔత్సాహిక వినియోగదారులు ఎంచుకునేందుకు అధిక అవకాశాలు ఉన్నాయి.

ఇసుజు మోటర్స్‌ ఇండియా డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ తోరు కిషిమోటో మాట్లాడుతూ.. ‘‘మా తాజా శ్రేణి ఉత్సాహపూరితమైన ఉత్పత్తులను పరిచయం చేయడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. ఇవి మారుతున్న వ్యాపార అవసరాలను, నగర వినియోగదారులు, మోటరింగ్‌ ప్రియుల అవసరాలను తీర్చనున్నాయి. భారతదేశంలో మొట్టమొదటి లైఫ్‌స్టైల్‌ యుటిలిటీ వాహనం ఇసుజు డీ–మ్యాక్స్‌ వీ–క్రాస్‌ ను పరిచయం చేయడం ద్వారా నూతన ప్రమాణాలను సృష్టించాము. ఇవి మా విజయగాధను మరింత ముందుకు తీసుకువెళ్తాయి. విస్తృత శ్రేణి అనుకూల, వైవిధ్యమైన ఉత్పత్తులతో , ప్రతి ఒక్కరికీ ఒక ఇసుజు అనే భరోసా అందిస్తున్నాము’’ అని అన్నారు.

సీవీ శ్రేణిలో నూతన ఫీచర్లు
· ఏ–ఎస్‌సీఆర్‌ (యాక్టివ్‌ సెలెక్టివ్‌ క్యాటలిస్ట్‌ రిడక్షన్‌
· సిల్వర్‌ ఇన్సర్ట్స్‌తో కారు తరహా అడ్వాన్స్‌డ్‌ (మిడ్‌ ) మల్టీ ఇన్‌ఫర్మేషన్‌ డిస్‌ప్లే
· వేరియబల్‌ ఇంటర్మీటెంట్‌ స్పీడ్‌ విండ్‌షీల్డ్‌ వైపర్‌ సిస్టమ్‌

వీ–క్రాస్‌ (4×2 AT)పై మెరుగైన శైలి అంశాలు –
· నూతన డిజైన్‌ బ్లాక్‌ అల్లాయ్‌ వీల్స్‌
· డార్క్‌ గ్రే ఓఆర్‌వీఎంలు
· ఫ్రంట్‌ ఫాగ్‌ ల్యాంప్‌ గార్నిష్‌
· ప్రీమియం బ్రౌన్‌ డ్యూయల్‌ టోన్‌ సీట్‌ అప్‌హోలెస్ట్రీ
· డ్యూయల్‌ టోన్‌ డ్యాష్‌బోర్డ్‌ మరియు డోర్‌ ప్యానెల్స్‌పై కేఫ్‌ బ్రౌన్‌ ఇన్సర్ట్స్‌
· గేర్‌ సెలెక్టర్‌ లీవర్‌ పై కేఫ్‌ బ్రౌన్‌ హైలెట్‌

పీవీ శ్రేణిలో నూతన ఫీచర్లు
· ఐడెల్‌ స్టాప్‌ సిస్టమ్‌ (ఐఎస్‌ఎస్‌)
· లో ఫ్రిక్షన్‌ టైర్లు
· ఆటో ట్రాన్స్‌మిషన్‌ ఫ్లూయిడ్‌ వార్మర్‌
· ప్యాసెంజర్‌ వాహన శ్రేణి కోసం నూతన కలర్‌ వాలెన్సియా ఆరెంజ్‌
· ఎంయు–ఎక్స్‌ మోడల్స్‌పై నూతన స్పోర్టీ యాగ్రెసివ్‌ గ్రిల్‌

వీ–క్రాస్‌ జెడ్‌ (4×2 AT) మోడల్‌ పై నూతన భద్రతా ఫీచర్లు

· ట్రాక్షన్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ (టీసీఎస్‌)
· ఎలకా్ట్రనిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌ (ఈఎస్‌సీ)
· హిల్‌ డీసెంట్‌ కంట్రోల్‌ (హెచ్‌డీసీ)
· హిల్‌ స్టార్ట్‌ అసిస్ట్‌ (హెచ్‌ఎస్‌ఏ)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News