- Advertisement -
న్యూఢిల్లీ : ఆదాయ పన్నుశాఖ గత నాలుగేళ్లలో 2980 గ్రూపులపై దాడులు చేసి రూ. 5095.45 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుందని పార్లమెంట్ సోమవారం వెల్లడించింది. 201920లో 984 గ్రూపులపై దాడులు చేసి రూ.1259 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకోవడమైందని , 202021లో 569 గ్రూపులను సోదా చేసి రూ. 881 కోట్ల విలువైన ఆస్తులు, 202223లో 741 గ్రూపులపై దాడులు చేసి రూ. 1765.56 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకోవడమైందని కేంద్ర ఆర్థిక సహాయమంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభకు తెలియజేశారు.
- Advertisement -