Monday, December 23, 2024

మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటి దాడి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజాము ను 50 బృందాలు ఆయన ఇంటితోపాటు కుమారుడు, అల్లుడి ఇళ్లలోనూ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఐటి రిటర్న్స్ డాక్యుమెంట్లు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం టిఆర్‌ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకొని ఐటి దాడులు చేస్తుందని టిఆర్‌ఎస్ వర్గాలు విమర్శలు గుప్పిస్తున్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో ఉన్న టిఆర్‌ఎస్ నాయకులను ఐటి దాడులతో తమ వైపు తిప్పుకోవాలని బిజెపి ప్రయత్నాలు చేస్తుందని టిఆర్‌ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News