Monday, December 23, 2024

ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటి దాడులు

- Advertisement -
- Advertisement -

 

ఎమ్మెల్యే ఇంట్లోను ఆఫీస్ లోను కొనసాగుతున్న ఐటీ దాడులు

మనతెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి: అధికార పార్టీకి చెందిన (బిఆర్ఎస్) భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి నివాసంలో ఐటి సోదాలు నిర్వహించడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో, ఆఫీస్ లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పైళ్ల శేఖర్ రెడ్డి అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటి సోదాలతో తీవ్ర కలకలం రేగుతోంది.

Also Read: హేతువు కొరవడిన దేశాల్లో భారత్ ఫస్ట్!

ఎమ్మెల్యే ఇంటితో పాటు ఆయన ఆఫీస్ ల్లోనూ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్- కొత్తపేట, భువనగిరి లోని ఎమ్మెల్యే నివాసానికి ఐటి అధికారులు చేరుకున్నారు. సుమారు 30 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే స్థిరాస్తులను పరిశీలించి వాటి వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి సతీమణి పైళ్ల వనిత డైరెక్టర్ గా కొనసాగుతున్న, హిల్ ల్యాండ్ టెక్నాలజీస్ , మేయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్, కంపెనీలల్లో తనిఖీలు కొనసాగుతున్నట్లు సమాచారం. భువనగిరి నియోజకవర్గంలో 2014, 2018 ఎన్నికల్లో పైళ్ల శేఖర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

అయితే ఈ సారి ఎన్నికల్లో గెలిస్తే తనకు మంత్రి పదవి ఖాయం అని ఇటు సోషల్ మీడియాలో అటూ కార్యకర్తల్లో జోరుగా ప్రచారం సాగుతోంది, కాగా.. రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయం నుంచి పైళ్ల శేఖర్ రెడ్డి అటు జనాల్లోకి, ఇటు రాజకీయాల్లోకి యాక్టివ్ అయ్యారు. గ్రామ స్థాయిలో ప్రతి కార్యకర్తలకు కష్టం వచ్చినా, ఎలాంటి నష్టం వాటిల్లిన ప్రత్యక్షంగా హాజరవుతున్నారు. కార్యకర్తలు పిలిస్తున్న ప్రతి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరు అవుతున్నారు. కావాలనే ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొలేక కొంత మంది ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పై ఐటి దాడులు నిర్వాహిస్తున్నట్లు బిఆర్ఎస్ నాయకులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News