Monday, December 23, 2024

రెండో రోజు కొనసాగుతున్న ఐటి దాడులు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్‌లో రెండో రోజూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. శ్రీఆదిత్య, ఉర్జిత్‌, సీఎస్‌కే, ఐరా రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల్లో ఐటీ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్‌, కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌ సహా హైదరాబాద్‌లోని 50 ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బ్యాంకు లావాదేవీలకు సంబంధితంచిన కీలకపత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఆదాయపు పన్ను రిటర్న్స్‌లో అవకతవకలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. ప్లాట్ల అమ్మకాలు, కొనుగోళ్లపై ఆరా తీస్తున్నారు. కంపెనీల డైరెక్టర్లు, అకౌంట్స్‌ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. కాగా, సోదాలు ముగిసేవరకు సిబ్బందిని ఇళ్లకు పంపేది లేదని అధికారులు తేల్చిచెప్పారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News