Saturday, November 16, 2024

బెంగళూరు కాంట్రాక్టర్లపై ఐటి దాడులు

- Advertisement -
- Advertisement -

IT attacks on Bangalore contractors

రూ. 750 కోట్ల అక్రమ ఆదాయం గుర్తింపు

న్యూఢిల్లీ: నీటి పారుదల, హైవే ప్రాజెక్టుల నిర్మాణంతో సంబంధం ఉన్న బెంగళూరుకు చెందిన మూడు ప్రధాన కాంట్రాక్టు కంపెనీలపై జరిపిన దాడులలో దాదాపు రూ. 750 కోట్ల అక్రమ ఆదాయాన్ని ఆదాయం పన్ను శాఖ గుర్తించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సిబిడిటి) మంగళవారం వెల్లడించింది. నాలుగు రాష్ట్రాల వ్యాప్తంగా 47 ప్రదేశాలలో ఈ నెల 7న ఐటి దాడులు మొదలైనట్లు సిబిడిటి తెలిపింది. నకిలీ కొనుగోళ్లు, కార్మిక వ్యయాన్ని పెంచి చూపించడం, నకిలీ సబ్ కాంట్రాక్టు ఖర్చులను చూపించడం వంటి వంటి అక్రమ కార్యకలాపాల ద్వారా తమ ఆదాయాన్ని ఈ మూడు కాంట్రాక్టు కంపెనీలు దాచిపెట్టాయని సిబిడిటి తెలిపింది. నిర్మాణ రంగ వ్యాపారంలో లేని 40 మంది వ్యక్తులను సబ్ కాంట్రాక్టర్లుగా పేర్లు పెట్టి వారిపైన నకిలీ సబ్ కాంట్రాక్టు ఖర్చులను ఒక కంపెనీ చూపించిందని తెలిపింది. ఈ అక్రమ వ్యవహారాలను ఆ బోగస్ వ్యక్తులు ఐటి అధికారుల ఎదుట ఒప్పుకున్నారని సిబిడిటి తెలిపింది. ఈ దాడులలో లెక్కల్లో చూపని రూ. 4.6౯ కోట్ల నగదు, రూ. 8.67 కోట్ల విలువైన బంగారు నగలు, రూ. 29.83 లక్షల విలువైన వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు సిబిడిటి తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News