Monday, December 23, 2024

ఐటి దాడులు… మోడీ ఖబడ్దార్, బిజెపి డౌన్ డౌన్

- Advertisement -
- Advertisement -

 

ఐటి దాడులు ఆపాలంటూ హైదరాబాద్ లోని కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీలో బిజెపి, ప్రధాన మంత్రి మోడీ డౌన్ డౌన్ అంటూ బిఆర్ఎస్ నాయకుల నిరసన..

యాదాద్రి భువనగిరి ప్రతినిధి: భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి జోలికి వస్తే ఖబడ్దార్‌ ప్రధాని నరేంద్ర మోడీ అంటూ భువనగిరి నియోజకవర్గ బిఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు హెచ్చరించారు. భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి ఇండ్లు, వ్యాపార సంస్థలపై జరుగుతున్న, ఐటి దాడులను నిరసిస్తూ శుక్రవారం హైదరాబాద్ లోని కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీలో ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి ఇంటి ముందు బిఆర్‌ఎస్‌ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ప్రధాని మోడీ ఖబడ్దార్, బిజెపి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. భువనగిరి బీబీనగర్, పోచంపల్లి, వలిగొండ మండల బిఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

Also Read: పుజారా ఔట్… యశస్వి జైస్వాల్ ఇన్

ఈ సందర్భంగా పలువురు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మాట్లాడారు. మోదీ ప్రభుత్వం కావాలనే తమ భువనగిరి నియోజక వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి ఇంటి ఆఫీస్ లపై, ఐటి అధికారులతో దాడులు చేయించి ఇబ్బంది పెడుతున్నదని మండిపడ్డారు. తక్షణమే ఐటి దాడులను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. రాబోయే రోజుల్లో బిజెపికి బుద్ధి చెప్తామని హెచ్చరించారు. భువనగిరిలో పైళ్ల శేఖర్ రెడ్డి ఎదుగుదలను ఓర్వలేక బిజెపి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News