Wednesday, January 22, 2025

హైదరాబాద్ లో క్రిస్టియన్ మిషనరీలపై ఐటి దాడులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మరోసారి ఐటి దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. క్రిస్టియన్ మిషనరీలతో పాటు సంస్థల్లో అధికారులు సోదాలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 40 చోట్ల ఈ తనిఖీలు జరుగుతున్నాయి. అల్వాల్, పటాన్ చెరువు, కీసర, జీడిమెట్ల, బొల్లారం, సికింద్రాబాద్, మెదక్, వరంగల్ సహా పలు ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. కాగా హైదరాబాద్ లో ప్రతీ నెలలో ఎక్కడో ఓ చోట ఐటీ రైడ్స్ జరుగుతుండగా..తాజాగా మరోసారి ఐటి దాడులు కలకలం రేపుతున్నాయి. ఈ రైడ్స్ ముగిసిన తరువాత పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి ఐటీ అధికారులు 20 బృందాలుగా విడిపోయి ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. బాలవికాసకు సంబంధించిన క్రిస్టియన్ మిషనరీలతో పాటు సంస్థల్లో అధికారులు ఈ దాడులకు పాల్పడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ సంస్థకు సంబంధించి ఆర్ధిక లావాదేవీలు, పన్ను ఎగవేతకు సంబంధించి పక్కా ఆధారాలతో అధికారులు పెద్ద ఎత్తున ఈ సోదాలు చేపట్టినట్టు సమాచారం. జంట నగరాల్లోని కీసర, ఘట్ కేసర్, మల్కాజ్ గిరి సహా 40 ప్రాంతాల్లో అధికారులు ఈ సోదాలు చేపట్టారు. అయితే రైడ్స్ ముగిస్తే కానీ ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News