Monday, December 23, 2024

ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్

- Advertisement -
- Advertisement -

లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నాలుగు బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అయ్యాయి. ఏఐసిసి అకౌంట్లతోపాటు, యూత్ కాంగ్రెస్ అకౌంట్లను కూడా ప్రీజ్ చేశారని ఆ పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్ శుక్రవారం ఆరోపించారు.

‘ఎన్నికల వేళ మా పార్టీ అకౌంట్లను సీజ్ చేయడం ప్రజాస్వామ్య ప్రక్రియకు విరుద్ధం. మా అకౌంట్లను ఫ్రీజ్ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో దెబ్బ కొట్టేందుకే ఇలా చేశారు’ అని అజయ్  మాకెన్ ఆరోపించారు. దీనిపై కోర్టుకు వెళ్లేందుకు ఆలోచిస్తున్నామని చెప్పారు.

ఆదాయ పన్ను శాఖకు కాంగ్రెస్ 210 కోట్ల రూపాయలు చెల్లించవలసి ఉంది. ఈ మొత్తాన్ని రాబట్టేందుకు ఆదాయపన్నుశాఖ ఇచ్చిన ఆదేశాల మేరకే బ్యాంకులు కాంగ్రెస్ పార్టీ ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News