Monday, December 23, 2024

నగరంలో ఐటీ శాఖ దాడుల కలకలం..

- Advertisement -
- Advertisement -

 

నగరంలో ఐటీ శాఖ దాడులు కలకలం రేపుతున్నాయి. ఈరోజు ఉదయం ఐటి కార్యాలయం నుండి 30 బృందాలుగా బయలుదేరి ఐటి దాడులు నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలు కన్స్ ట్రక్షన్  కార్యాలయాలు, బిల్డర్ ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్ లోని శ్రీ ఆదిత్య హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఊర్జిత కన్స్ట్రక్షన్స్,     సిఎస్ కె బిల్డర్స్ తదితర కార్యాలయంలో దాడులు కొనసాగుతున్నాయి.

శ్రీ ఆదిత్య హోమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోటారెడ్డి, అతని కుమారుడు ఆదిత్య రెడ్డి ఇళ్లల్లో కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఊర్జిత కన్స్ట్రక్షన్స్ శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో కార్యాలయంలో , మరో బిల్డర్ మాధవరెడ్డి ఇంట్లో, సిఎస్ కె  కార్యాలయంలో సోదాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఐటీ రిటర్న్స్ లో అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించిన ఐటీ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు నిర్ధారించుకొని సోదాలు చేస్తున్నట్లు ఐటి అధికారులు తెలిపారు.
గడిచిన ఐదు సంవత్సరాల ఐటీ రిటర్న్స్ వివరాలను అకౌంట్ డిపార్ట్మెంట్ నుండి తీసుకోని ఆరా తీస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News