Thursday, January 23, 2025

టిఎంసి ఎంఎల్‌ఎ నివాసంలో ఐటి సోదాలు..

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: పన్ను ఎగవేత ఆరోపణలకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ ఎంఎల్‌ఎ బైరాన్ బిశ్వాస్ నివాసంలో జరిపిన సోదాల్లో ఆదాయం పన్ను అధికారులు దాదాపు రూ.70లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారని ఐటి ఉన్నతాధికారి ఒకరు గురువారం చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్ జిల్లా సంసేర్‌గంజ్‌లో ఉన్న ఎంఎల్‌ఎ నివాసంలో బుధవారం ఉదయం మొదలైన ఈ సోదాలు రాత్రి పొద్దుపోయే దాకాదాదాపు 19 గంటల పాటు కొనసాగినట్లు ఆ అధికారి తెలిపారు.

ఎంఎల్‌ఎ నివాసంలో సోదాల్లో తాము దాదాపు రూ.70 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని, అంత పెద్ద మొత్తంలో నగదును ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారనే దానిపై క్లారిటీ లేదని ఆ అధికారి చెప్పారు. కాగా సోదాలపై పిటిఐ ఎంఎల్‌ఎను ఫోన్‌లో సంప్రదించగా, స్పందించడానికి ఆయన నిరాకరించారు. సాగర్‌దిఘి నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై గెలిచిన బిశ్వాస్ ఆ తర్వాత టిఎంసిలో చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News