Monday, December 23, 2024

మూన్‌లైటింగ్ ఉద్యోగులకు ఐటి శాఖ నోటీసులు

- Advertisement -
- Advertisement -

వెయ్యికి పైగా జారీ అయినట్లు సమాచారం

న్యూఢిల్లీ: కరోనా సమయంలో జోరుగా వినిపించిన మూన్‌లైటింగ్ అంశం మళ్లీ తెరమీదికి వచ్చింది. మూన్‌లైటింగ్ ద్వారా అదనపు ఆదాయాన్ని పొందిన ఉద్యోగుల్లో కొందరు తమ ఆదాయాన్ని ఐటి రిటర్న్‌లలో చూపించకపోవడమే ఇందుకు కారణం.దీంతో ఆయా ఉద్యోగులకు ఐటి శాఖ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి 2019 20, 2020 21ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఐటి శాఖ ఈ నోటీసులు ఇచ్చినట్లు ఓ ఆంగ్లపత్రిక తెలిపింది. కరోనా సమయంలో మూన్‌లైటింగ్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

Also Read: పాముతో ప్రేమలో పడిన ఆవు (వీడియో వైరల్)

ముఖ్యంగా ఐటి రంగంలో ఈ పదం బాగా వినిపించింది. ఒక కంపెనీలో పూర్తిస్థాయి ఉద్యోగిగా పని చేస్తూనే అదనపు ఆదాయం కోసం మరో సంస్థలో పని చేసి కొందరు జీతం తీసుకున్నారు. కొందరు నెలవారీ, మరికొందరు మూడు నెలలకోసారి చొప్పున ఆదాయం పొందారు. వీరిలో కొందరికి విదేశాలనుంచి కూడా చెల్లింపులు అందాయి. అయితే ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు దీన్ని సమర్థించగా, మరికొందరు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మూన్‌లైటింగ్‌కు పాల్పడిన వారికి కొన్ని కంపెనీలు ఉద్యోగాలనుంచి తొలగించాయి కూడా.

ఈ నేపథ్యంలో కొందరు ఉద్యోగులు కేవలం ప్రధాన కంపెనీ ఆదాయాన్ని మాత్రం తమ రిటర్న్‌లలో చూపించినట్లు ఐటి శాఖ గుర్తించింది. తొలుత రూ.5 లక్షల నుంచి రూ.10లక్షల వరకు వార్షికాదాయాన్ని రిటర్న్‌లలో చూపని వారికి ఈ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య వెయ్యికి పైగానే ఉన్నటు ్లసంబంధిత వర్గాలు తెలిపాయి. తమ ఉద్యోగులు మూన్ లైటింగ్‌కు పాల్పడుతున్నారంటూ కొన్ని కంపెనీలే స్వయంగా ఐటి శాఖదృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. త్వరలోనే మరికొంతమందికి కూడా నోటీసులు జారీ అయ్యే అవకాశముంని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News