Wednesday, January 22, 2025

సుప్రీంకోర్టుపై అభ్యంతరకర వీడియో: సిజెఐ స్పందన ఇది…

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టును వేశ్యావాటికతో పోలుస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో చక్కర్లు కొడుతోందని ఒక న్యాయవాది శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ దృష్టికి తీసుకురాగా పట్టించుకోవలసిన అవసరం లేదంటూ ఆయన తేలికగా తీసుకున్నారు.

మణిపూర్ హింసాకాండపై శుక్రవారం కోర్టులో విచారణ ముగిసిన సందర్భంగా ఒక న్యాయవాది చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జెబి పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం ఎదుట ఈ విషయాన్ని ప్రస్తావించారు.

ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పటికే ఈ విషయాన్ని రిజిస్ట్రార్ దృష్టికి తీసుకువచ్చాను. సుప్రీంకోర్టును వేశ్యావాటికగా, మీతో కూర్చున్న న్యాయమూర్తులను అవినీతిపరులుగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియోలో సర్కులేట్ అవుతోంది అని ఆ న్యాయవాది సిజెఐ చంద్రచూడ్ దృష్టికి తీసుకువచ్చారు.

దీనికి సిజెఐ స్పందిస్తూ ఆందోళన చెందవద్దు..పట్టించుకోవలసిన అవసరం లేదు అంటూ బదులిచ్చారు.
వీడియోలో సుప్రీంకోర్టుపై అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించారని కూడా ఆ న్యాయవాది తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News