- Advertisement -
ముంబయి: అక్రమ ఆస్తుల కేసులో ఆదాయం పన్ను(ఐటి)శాఖ మాజీ ఇన్‌స్పెక్టర్ లీలాధర్‌బంగేరా(67)కు మూడేళ్ల కఠిన కారాగారశిక్ష విధిస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడించింది. రూ.16,000 జరిమానా కూడా విధించింది. హైకోర్టుకు వెళ్లేందుకు లీలాధర్‌కు నాలుగు వారాల వెసులుబాటు కల్పించింది. అప్పటివరకు తీర్పు అమలును వాయిదా వేసింది. ఐటి ఉద్యోగిగా తన సంపాదనకన్నా రూ.59.89 లక్షల అక్రమ ఆస్తుల్ని కలిగి ఉన్నట్టు కోర్టు నిర్ధారించింది. ఈ మొత్తాన్ని ఆయనకు సంబంధించిన స్థిర, చరాస్తుల నుంచి జప్తు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. 2007 నుంచి 2010 వరకు ఆయన ఈ అక్రమాస్తుల్ని ఆర్జించినట్టు సిబిఐ అభియోగాలు మోపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయిన లీలాధర్ భార్యపైనా ఈ కేసు నమోదైంది. అయితే, ఆమె 2016లో మరణించడంతో ఈ కేసు నుంచి మినహాయించారు.
- Advertisement -