Sunday, January 19, 2025

ప్రేమ విఫలం.. ఐటి ఉద్యోగి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

గచ్చిబౌలి: ప్రేమ విఫలమై ఐటీ ఉ ద్యోగి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా బాతులూరు గ్రామానికి చెందిన గజ్జ నాగశేషు లు వ్యవసాయం చెలుకుంటు జీవనం సాగిస్తున్నాడు. ఆతని కుమారుడు గజ్జ నాగచక్రపాణి (28) గచ్చి బౌలిలోని సాన్విక మేన్స్ పీజీ హాస్టల్‌లో నివాసముంటు ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు. కాగా డిసెంబర్ 20వ తేదీన నాగ చక్రపాణి తను ఉంటున్న హాస్టల్‌లోని సీలింగ్ ఫ్యాన్‌కు బెడ్ షీట్ తో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

అది గమనించిన రూమ్ మేట్స్ పోలీసులకు, అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా ఎటువంటి ఆధారాలు లభించలేదు. ప్రేమ విఫలం కావడంతోనే మనస్థాపానికి గురై నాగచక్రపాణి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News