Sunday, December 22, 2024

సైబరాబాద్‌లో ధర్నాలకు అనుమతి లేదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు చేపట్టేందుకు అనుమతి తేదని మాదాపూర్ డిసిపి సందీప్ ఆదేశాలు జారీ చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మద్దతుగా కొద్ది రోజుల నుంచి ఐటి ఉద్యోగులు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిరసనలు, ధర్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఐటి ఉద్యోగులు ధర్నాలు చేస్తుండడంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఐటి కారిడార్ కావడంతో ధర్నాల ఫ్రభావం ట్రాఫిక్‌పై తీవ్రంగా ఉంది. దీంతో పోలీసులు ధర్నాలు చేస్తున్న వారికి హెచ్చరికలు జారీ చేశారు.

ధర్నాలకు ఎలాంటి అనుమతి లేదని, పబ్లిక్ న్యూసెన్స్, ట్రాఫిక్ జాంకు కారణం కావొద్దని డిసిపి సందీప్ వార్నింగ్ ఇచ్చారు. పధాన రోడ్లు, ఓఆర్‌ఆర్‌పై ధర్నా చేయాలనుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే పలువురిని ముందస్తు అరెస్టు చేశామని తెలిపారు. ధర్నాలు చేసి విధ్వంసం సృష్టిస్తే వారు పనిచేసే కంపెనీలకు నోటీసులు పంపిస్తామని హెచ్చరించారు. సామాన్య ప్రజలకు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News