Thursday, January 23, 2025

ఐటి జోష్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఐటి రంగంలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోంది. ఐటి రంగం ముఖచిత్రమే మారిపోయింది. రా ష్ట్రానికి పెట్టుబడుల వరద పారుతోంది. హైదరాబాద్ పెట్టుబడుల స్వర్గధామంగా అవతరించింది. పెట్టుబడులకు అనుకూలమైన పరిస్థితులు భాగ్య నగరంలో పదిలం గా ఉన్నాయనే స్థిరచిత్తంతో హై దరాబాద్ కేంద్రంగా ఎంఎన్‌సి కం పెనీలు పనిచేస్తున్నాయి. లక్షలాది మందికి ఉద్యోగావ కాశాలతో పాటు ఐటి ఎగుమతులు మూడింతలుపెరిగాయి. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో స్థానం పొందిన 20కి పైగా బహుళ జాతీయ కంపెనీలు (ఎంఎన్‌సి) హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. గడిచిన ఎనిమిదన్నర ఏళ్లలో ప్రభు త్వం చేసిన కృషికి నిదర్శనం. ఫలితం కూడా అంతే స్థాయిలో కనిపిస్తోంది.

గడిచిన ఎనిమిదేళ్ల కాలంలో ఐటి ఎగుమతులు (2014-15లో 66276 కోట్లు కాగా, 2021-22 నాటికి 1,83,569 కోట్లు) అంటే గణాంకాలను బట్టి ఐటి ఎగుమతులు మూడింతలు పెరిగాయి.అంతే స్థాయిలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు ఊహించని రీతిలో ఎగబాకాయి. (2014-15లో 3,71, 774 మందికి ఉద్యోగావకాశాలు లభించగా.. 2021-22 సంవత్సరానికల్లా ఉద్యోగావకాశాలు పొందిన వారి సంఖ్య 7,78,121కు చేరింది). ఈ విధంగా ఐటి రంగంలో రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తోంది. ఇదే విషయాన్ని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ట్విట్టర్ ద్వారా తెలి పారు. అంతేకాదు, ఆయా సంవత్సరాలకు సంబంధించి ఐటి ఎగుమతులు, ఉద్యోగావకాశాల ప్రగతి నివేదికను సైతం వెలువరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News