Wednesday, January 22, 2025

ప్రారంభానికి ముందే నల్గొండ ఐటి టవర్‌కు క్యూ కడుతున్న ఐటి సంస్థలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ద్వితీయ శ్రేణి నగరాల్లో స్థానికంగా ఉండే యువతకు, ప్రత్యక్షంగా,పరోక్షంగా ఐటి ఉద్యోగాల్లో అవకాశం కల్పించడమే కాకుండా ఆయా ప్రాంతాలను అభివృద్ది చేయాలనే లక్ష్యాన్ని ఐటి ( ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజి) శాఖ నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో ఐటి హబ్‌లను ఏర్పాటు చేస్తూ స్థానికంగా ఉండే సుమారు 2 వేలకు మందికి పై యువతకు ఉపాధికి కల్పిస్తోంది. ఇప్పటికే వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహాబూబ్‌నగర్,సిద్దిపేట ప్రాంతాల్లో ఐటి హబ్‌లను ఏర్పాటు చేయడంతో అనేక ఐటి కంపెనీలు తమ కార్యాకలాపాలను ప్రారభించాయి.అయితే కొన్ని ప్రాంతాల్లో ఐటి హబ్‌లు ప్రారంభానికి ముందే కొన్ని ఐటి సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంటుండటంతో ఇటు ఐటి పరిశ్రమల వర్గాల వారే కాకుండా నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నల్గొండలో త్వరలో ప్రారంభం కానున్న ఐటి టవర్‌లో కార్యాకలాపాలు ప్రారంభించేందుకు సోనాటా అనే అంతర్జాతీయ సంస్థ ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా గత నెలలో ఇందుకు సంబంధించిన ఒప్పందాన్ని ప్రభుత్వంతో కూడా చేసుకుంది. దీని ద్వారా స్థానికంగా ఉండే సుమారు 200 మంది యవతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సెక్టార్, ఆరోగ్య రంగం, లైఫ్ సైన్స్ రంగాల్లో సేవలు అందించేందుకు అవసరమైన సాప్ట్‌వేర్ డవలప్‌మెంట్, టెక్నాలజి, ఇన్నోవేషన్ల కోసం సోనాటా కార్యాకలాపాలను నిర్వహించనుంది. దీంతో పాటు సుమారు మరో 40 కేంద్రాలు నల్గొండ ఐటి టవర్‌లో కార్యాకపాలను నిర్వహించేందుకు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. వీటి ద్వారా స్థానికంగా ఉండే సుమారు 2500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.

ఇవే కాకుండా మరిన్ని కంపెనీలు ఏర్పాటు కోసం అధికారులు విదేశాల్లో పర్యటిస్తున్నప్పుడల్లా టూ టైర్ నగరాల్లో పెట్టుబడులను పెట్టి స్థానికంగా ఉండే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని పలు సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే ద్వితీయ శ్రేణి నగరాల్లో సుమారు 50 వేల మంది ఐటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పెట్టుకున్న లక్షం నెరవేరినట్లే అనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
వేగంగా సాగుతున్న నల్గొండ ఐటి టవర్ పనులు నల్గొండలోని హైదరాబాద్ రూట్‌లో పాలిటెక్నిక్ కాలేజి పక్కన మూడు ఎకరాల్లో 75 వేల చదరపు అడుగుల్లో నిర్మిస్తున్న ఐటి టవర్ పనులు వేగంగా శరవేగంగా సాగుతున్నాయి.నల్గొండ ఐటి టవర్‌ను అగస్టులో ప్రారంభిస్తామని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అధికారులు పగలు ,రాత్రి తేడా లేకుండా సంబంధిత పనులను పూర్తిచేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News