Monday, December 23, 2024

ఇచ్చింది… ఇచ్చేది… కాంగ్రెస్సే! హామీకి కట్టుబడే ఉన్నాము !!

- Advertisement -
- Advertisement -

స్రుపీంకోర్టు తీర్పును అమలు చేస్తాం
జెఎన్‌జె విస్త్రుత స్థాయి సమావేశంలో పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి
సందేశాలతో మద్దత్తు తెలిపిన మంత్రులు

మన తెలంగాణ / హైదరాబాద్ : జర్నలిస్టులకీ ఇళ్లస్థలాలు ఇచ్చింది, ఇచ్చేది కాంగ్రెస్‌ప్రభుత్వమేనని, సుప్రీం కోర్టు తీర్పును యథాతథంగా అమలు చేస్తామని టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి కాంగ్రెస్ ప్రభుత్వం తరపున హమీనిచ్చారు. ప్రతిపక్షంలో ఉండి జెఎన్‌జె హౌసింగ్ సొసైటీ సభ్యులు పిసిసి అధ్యక్షులైన నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పలుమార్లు విన్నవించడంతో ఈ అంశంపై సంపూర్ణ అవగాహన ఏర్పడిందని ఆయన తెలిపారు. గురువారం రవీంద్రభారతిలో టీం జెఎన్‌జె నిర్వహించిన జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్టు మాక్ హౌసింగ్ సొసైటీ విస్రుతస్థాయి సమావేశంలో మల్లు రవి అతిధిగా పాల్గొని మాట్లాడారు.

అంతకు ముందు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున రాలేని పరిస్థితుల్లో రాష్త్ర రెవిన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయ, సహకారశాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పంపిన తమ సందేశాల్లో జెఎన్‌జె జర్నలిస్టులకు రాష్త్ర ప్రభుత్వం అండగా వుంటుందని, వారికి ఇళ్ళ స్థలాలు ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు. గతంలో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, గోపన్నపల్లిలో జర్నలిస్టులకు ఇళ్ళస్థలాలు ఇచ్చింది కాంగ్రెస్‌యేనని, ఇప్పుడు కూడా ఇచ్చేది తామేనని మల్లు భరోసా ఇచ్చారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం సుప్రీం తీర్పును అమలు చేయకుండా ఆ సొసైటీ సభ్యులపై దిగ్బందాలు విధించి భయబ్రాంతులకు గురిచేసిందని ధ్వజమెత్తారు.

ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు ఏ విధమైన అన్యాయం జరిగినా ఆ సమస్యలపై కోర్టుకు వెళ్తారని, వీటిని పరిగణనలోకి తీసుకున్న కోర్టులు వాటిని పరిష్కరించాలని తీర్పులు చెబితే వాటిని అమలు చేయకుండా తొక్కిపెట్టడం అప్రజాస్వామికమని అన్నారు. జెఎన్‌జె హౌసింగ్ సొసైటీకి ఇళ్ల స్థలాలు అప్పగించే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన భరోసా మేరకు ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు. జెఎన్‌జె విస్తుతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన సొసైటీ వ్యవస్థాపక సభ్యులు పివి రమణరావు మాట్లాడుతూ 16 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సొసైటీ స్థలాల సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందని నమ్ముతున్నామన్నారు. ఈ మేరకు పాత మేనేజింగ్ కమిటీని పూర్తి స్థాయిలో రద్దు చేసేందుకు సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించినట్లు తెలిపారు.

సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులను భయబ్రాంతులకు గురిచేసి, గత ప్రభుత్వం అండదండలతో అణచివేసారని సొసైటీ సభ్యుడు ఆశోక్‌ రెడ్డి అన్నారు. ఈ విస్త్రుత స్థాయి సమావేశంలో సభ్యుల ఆమోదంతో సొసైటీ మేనేజింగ్ కమిటీని రద్దుచేస్తూ ఏకగ్రీవం తీర్మానం ఆమోదించారు. జెఎన్‌జె సొసైటీకి ఇళ్ళస్థలాలు అ్ప్పగిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హమీ ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందనలు తెలుపుతూ సభ మరో తీర్మానం చేసింది. సొసైటీకి చెందిన దాదాపు 70 మంది సభ్యులు మృతిపట్ల సభ ప్రగాడ సంతాపం తెలిపింది. జెఎన్‌జె సొసైటీ భవిష్యత్ కార్యాచరణ రూపొందించడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సలహా మేరకు కొత్త కమిటీని ఎన్నుకోవడానికి సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ కార్య్రకమంలో టీం జెఎన్‌జె సభ్యులు కె.మంజుల, బాలినేని నాగభూషణరావు, బోడపాటి శ్రీనివాసరావు, టాటా శ్రీనివాస్, చిత్ర, తాహీర్ రుమాని, హసన్ షరీఫ్, నర్సింగ్‌రాజ్, శ్రీచంద్ర, మారేపల్లి లక్ష్మణ్ తదితరులు మాట్లాడారు.

It gave... It gives... Congress! We stand by the guarantee!!

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News