Thursday, January 23, 2025

ఆ విషయం గుర్తొస్తే బాధపడుతుందట

- Advertisement -
- Advertisement -

రాశీ ఖన్నా హీరోయిన్ గా మారకముందు ఒక మోడల్. జర్నలిజం చదివి మోడలింగ్‌లోకి అడుగుపెట్టి హీరోయిన్‌గా అవకాశాలు వెతుక్కుంటూ ముంబయ్ వెళ్ళింది ఈ ఢిల్లీ భామ. అలా ‘మద్రాస్ కేఫ్’ చిత్రంలో మొదటి అవకాశం వచ్చింది. ఇక రాజమౌళి తన కొత్త చిత్రం కోసం హీరోయిన్‌ని చూస్తున్నారు అన్న విషయం తెలుసుకొని హైదరాబాద్ విచ్చేసింది. రాజమౌళి నిర్వహించిన ఆడిషన్‌కి అటెండ్ అయింది.

కానీ రాజమౌళికి ఆమె నచ్చలేదు. తను అనుకున్న పాత్రకు ఈ బబ్లీ బ్యూటీ సరిపోదు అని రాజమౌళి భావించారు. అయితే తన మిత్రుడు సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ‘ఊహలు గుస గుసలాడే’లో అవకాశం కోసం ప్రయత్నించు… అని ఆయన సలహా ఇచ్చారట. ఆ తర్వాత రాజమౌళి… తమన్నాని హీరోయిన్ గా తీసుకున్నారు. ఆ సినిమా పేరు బాహుబలి. ఈ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీలో అవకాశాన్ని కోల్పోయిన రాశీ ఖన్నా ఆ విషయం గుర్తొచ్చినప్పుడు బాధపడుతుందట.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News