- Advertisement -
హైదరాబాద్: ప్రపంచంలోనే అతి పెద్ది టి హబ్-2 ఏర్పాటు చేశామని మంత్రి కెటిఆర్ తెలిపారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ క్యాపిటల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఐటి శాఖ మంత్రి కెటిఆర్, ఐటి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. హైదరాబాద్‌లో 2014-15కు ముందు ఒకటే ఇంక్యుబేషన్ ఉందని, ప్రస్తుతం 60 నుంచి 70 వరకు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ఇన్‌ఫ్రాస్టక్చర్ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించిందన్నారు. వెంచర్ క్యాపిటలిస్ట్‌లకు స్వాగతం పలుకుతున్నామని, బెంగళూరు కంటే వేగంగా ఇన్నోవేషన్‌లో హైదరాబాద్ అభివృద్ధి చెందిందని కెటిఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌కు అనేక స్టార్టప్ కంపెనీలు వచ్చాయని తెలియజేశారు.
- Advertisement -