మనతెలంగాణ/హైదరాబాద్ : లైఫ్ సైన్సెస్ రం గంలో తెలంగాణకు మరో పెట్టుబడి రానున్నది. స్టెమ్ క్యూర్స్ కంపెనీ హైదరాబాద్‌లో తయారీ ల్యాబ్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వ చ్చింది. ఈ ల్యాబ్ ప్రధానంగా స్టెమ్ చికిత్సపై దృష్టి సారిస్తుంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద స్టెమ్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. దా దాపు 54 అమెరికన్ మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ తయారీ యూనిట్ తో 150 మందికిపైగా ఉద్యోగ ఉపాది అవకాశా లు లభిస్తాయి.అమెరికా పర్యటనలో ఉన్న మం త్రి కె.టి. రామారావుతో స్టెమ్ క్యూర్స్ సంస్థ వ్య వస్థాపకులు డాక్టర్ సాయిరాం అట్లూరి బోస్టన్ నగరంలో సమావేశమయ్యారు. అమెరికాలో ఉ న్న అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని, నైపుణ్యా న్ని భారతదేశానికి తీసుకువచ్చి తీవ్రమైన వ్యా ధులకు స్టెమ్‌సెల్ ఉత్పత్తులతో చికిత్సను అం దించడమే ఈ కంపెనీ లక్ష్యం. ప్రపంచ మెడికల్ ఇన్నోవేషన్‌కు తన సొంత నగరమైన హైదరాబాద్ హబ్‌గా మారిందని సాయిరాం అట్లూరి సంతోషం వ్యక్తం చేశారు.
తమ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా మంత్రి కెటిఆర్ అందిస్తున్న సహకారానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
స్టెమ్ క్యూర్స్ కంపెనీని హైదరాబాద్‌కు ఆహ్వానిస్తున్నట్లు మంత్రి కెటిఆర్ తెలిపారు. కంపెనీ పెట్టుబడి ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేసిన ఆయన సంస్థకు కావాల్సిన సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. అత్యంత తీవ్రమైన వైద్య, ఆరోగ్య సమస్యలకు స్టెమ్‌సెల్ థెరపీతో పరిష్కారం లభిస్తుందని కెటిఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ అత్యాధునిక చికిత్సా విధానాలు మనదేశంలో విస్తృతంగా అందుబాటులోకి రావాలని అన్నారు. స్టెమ్ క్యూర్ సంస్థ ఏర్పాటు చేయనున్న ల్యాబ్‌తో దేశంలో ఈ చికిత్స విధానాలు అందరికీ అందుతాయని మంత్రి కెటిఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
నల్గొండకు విస్తరించనున్న ఐటి పరిశ్రమ
నల్లగొండ పట్టణానికి ఐటీ పరిశ్రమ రానున్నది. నల్గొండలో త్వరలో ప్రారంభం కానున్న ఐటి టవర్‌లో తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ సొనాటా సాఫ్ట్‌వేర్ ముందుకు వచ్చింది. ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటి పరిశ్రమను విస్తరించాలన్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా నల్గొండ ఐటి టవర్‌లో సుమారు 200 మందికి సొనాటా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కల్పించనున్నది. మంత్రి కెటిఆర్‌తో అమెరికాలోని బోస్టన్ నగరంలో సొనాటా సాఫ్ట్‌వేర్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు శ్రీని వీరవెల్లి సమావేశమయ్యారు. అనంతరం ఈ ప్రకటన వెలువడింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సెక్టార్, ఆరోగ్య రంగము, లైఫ్ సైన్సెస్ రంగాల్లో సేవలు అందించేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్ డవలప్‌మెంట్, టెక్నాలజీ ఇన్నోవేషన్ల కోసం సొనాటా కార్యకలాపాలు నిర్వహించనున్నది. ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించనున్న కంపెనీ స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో కల్పించనుంది. మంత్రి కెటిఆర్‌తో జరిగిన సమావేశంలో తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పెట్టుబడుల ప్రత్యేక కార్యదర్శి, విష్ణువర్ధన్ రెడ్డి, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్నాథ్ రెడ్డి ఉన్నారు.
హైదరాబాద్‌లో ప్లూమ్ సంస్థ కేంద్రం ఏర్పాటు
కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్స్‌లో మెట్టమెదటి సాస్ ఎక్స్‌పీరియన్స్ ప్లాట్‌ఫామ్ ప్లూమ్ సంస్థ హైదరాబాద్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కేంద్రం ఏర్పాటుతో దాదాపు 100 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. హైదరాబాద్ నగరంలో తమ ఉనికిని చాటుకునే దిశగా సాగుతున్న తమ ప్రయాణంలో ఇది మెట్టమెదటి అడుగని సంస్థ ఛీఫ్ డవలప్‌మెంట్ ఆఫీసర్ కిరణ్ ఎడార అన్నారు. హైదరాబాద్‌లో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పర్యావరణ వ్యవస్థకు తమ వంతు సహకారం అందించడానికి సంస్థ సిద్ధంగా ఉందన్నారు.
సనోఫీ కంపెనీ కేంద్రం ఏర్పాటుతో 350 ఉద్యోగాలు
గ్లోబల్ ఫార్మాస్యూటికల్ దిగ్గజం సనోఫీ లీడర్‌షిప్ బృందం తెలంగాణ ఐటి, పరిశ్రమల మంత్రి కెటిఆర్ సమావేశమయ్యింది. ఈ ఏడాది ప్రారంభంలో హైదరాబాద్‌లో సనోఫీ కంపెనీ 350 ఉద్యోగాలతో కేంద్రాన్ని ప్రకటించింది.హైదరాబాద్ కేంద్రం తమ గ్లోబల్ టాలెంట్ హబ్‌లలో ఒకటని కంపెనీ తెలిపింది. ఈ రకమైన పెట్టుబడులు సాంకేతిక పురోగతిలో ముందంజలో ఉండటానికి,ఆరోగ్య సంరక్షణలో భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ నిబద్ధతను ప్రదర్శిస్తాయని మంత్రి కెటిఆర్ అన్నారు.
హైదరాబాద్‌లో పై హెల్త్ రీసెర్చ్ సెంటర్
హైదరాబాద్‌లో అత్యాధునిక టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని పై హెల్త్ నిర్ణయించింది. బోస్టన్‌లో జరిగిన సమావేశంలో పై హెల్త్ సహ వ్యవస్థాపకులు డాక్టర్ బాబీ రెడ్డి తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి. రామారావుతో సమావేశమయ్యారు. అనంతరం హైదరాబాద్‌లో సమీకృత క్యాన్సర్ ఆసుపత్రి, పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని పై హెల్త్ ప్రతినిధులు మంత్రి కెటిఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో అత్యాధునిక టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్న నిర్ణయం పట్ల మంత్రి కెటిఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ అండ్ ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి ఇ విష్ణువర్ధన్‌రెడ్డి, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్‌నాథ్‌రెడ్డి ఆత్మకూరి తదితరులు పాల్గొన్నారు.