Sunday, September 8, 2024

ఇది ప్రజా ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

*ఆరు గ్యారెంటీలపై వంద రోజుల్లో కార్యాచరణ

*ప్రజా పాలనలో దేశానికే ఆదర్శం కాబోతున్నాం

*అమరుల ఆశయాలు, ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కృషిచేస్తాం

*తొలి అడుగులోనే సంక్షేమానికి మా ప్రభుత్వం నాంది పలికింది

*మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉంది

* ప్రజల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యం

*వ్యవసాయానికి 24గంటల విద్యుత్ ఇచ్చి తీరుతాం

*ప్రతి పంటకు మద్దతు ధర

*రూ.2లక్షల రుణమాఫీపై త్వరలో విధివిధానాలు

* ఏడాదిలోపు 2లక్షల ఉద్యోగాల కల్పన

* ఆరు నెలల్లోగా మెగా డిఎస్‌సి

* ప్రతి ఆడబిడ్డను మహాలక్ష్మిని చేయాలన్నదే ప్రభుత్వం ఆలోచన

* ఇది సామాన్యుడి సర్కార్ అని గర్వంగా చెబుతున్నా

*నియంతృత్వ పాలన, పోకడల నుంచి తెలంగాణకు విముక్తి

* మార్పు కోసం ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు

* తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కలను సాకారం చేసిన సోనియాగాంధీకి కృతజ్ఞతలు

*అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో గవర్నర్ తమిళిసై

*కాళోజీ కవితతో ప్రసంగం ప్రారంభం.. దాశరథి సూక్తులతో ముగింపు

మనతెలంగాణ/హైదరాబాద్:  ఇది ప్రజా ప్రభుత్వమని, తమది ప్రజల పా లన అని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలు చెప్పుకునేందుకు అవకాశం కల్పించామని చెప్పారు. ఇది సామాన్యుడి సర్కార్ అని గ ర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉందని తెలిపా రు. తమ పాలన దేశానికే ఆదర్శం కాబో తుందని, అమరవీరుల ఆకాంక్షలను పరిగ ణనలోకి తీసుకుని పాలన సాగిస్తామని తమిళిసై వెల్లడించారు. ఉభయసభలను ఉద్దే శించి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ శుక్రవారం అసెంబ్లీలో ప్రసంగించారు. రాష్ట్రంలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వానికి గవర్నర్ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

అమరుల ఆశయాలు, విద్యార్థుల పోరాటాలు, పౌర సమాజ ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని పాలన సాగబోతుందని తెలిపారు. తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాం క్షలను గౌరవిస్తూ 2014లో ప్రత్యేక రాష్ట్రం కలను సాకారం చేసిన అప్పటి యుపిఎ చైర్‌పర్సర్ సోనియాగాంధీకి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరపున గవర్నర్ కృత జ్ఞతలు తెలిపారు. నాటి యుపిఎ ప్రభుత్వానికి, అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు ధన్యవాదాలు తెలిపా రు. ఎన్నికల సందర్భంగా ఇందిరమ్మ రా జ్యం తెస్తామని మాట ఇచ్చామని, ఇక ని ర్భందాలు, నియంతృత్వ ధోరణులు ఉండ బోవని వెల్లడించారు. ప్రజల ఆశలు, ఆకాం క్షలు నెరవేర్చే దిశగా కృషి చేస్తామని వెల్ల డించారు.

ప్రజా ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రజావాణి చేపట్టామని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరాలని కోరు తున్నానని పేర్కొన్నారు. ప్రజాసేవలో విజ యం సాధించాలని కొత్త ప్రభుత్వాన్ని కోరుతున్నానని అన్నారు. కొత్త ప్రభుత్వం ప్రయాణం ప్రజాసేవకు అంకితం కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. రైతులు, యువత, మహిళలకు ఈ ప్రభుత్వం ప్రాధా న్యత ఇస్తుందని చెప్పారు. ప్రజలందరికీ స మాన అవకాశాలు కల్పించాలని, ప్రజా సంక్షేమం కోసమే ఆరు గ్యారెంటీలు ప్రక టించామని స్పష్టం చేశారు. హామీలకు చట్టబద్ధ్దత కల్పించే దస్త్రంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి తొలి సంతకం చేశారని, ప్రజలకు ఇచ్చిన ప్రతిమాటకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లో రెండు గ్యారెంటీలు అమలు చేశామని చెప్పారు. వచ్చే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల అమలుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్య భద్రత.. తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీని ప్రస్తుత అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దామని, ఆరోగ్య శ్రీ పరిధిని రూ. 10 లక్షలకు పెంచామని వెల్లడించారు. అమరవీరుల కుటుంబాలకు 250 గజాల ఇంటి స్థలం, గౌరవభృతి ఇస్తామని, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తామని, రూ. 2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ఉంటుందని చెప్పారు. అసైన్డ్, పోడు భూములకు త్వరలోనే పట్టాల పంపిణీ చేస్తామన్నారు.

తెలంగాణకు హైదరాబాద్ గుండెకాయ లాంటిది
తెలంగాణకు హైదరాబాద్ నగరం పాలన కేంద్రం మాత్రమే కాదు అని, పేద వర్గాల అభ్యున్నతికి అవసరమైన ఆర్థిక వనరులను అందించే గుండెకాయ వంటిదని గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌కు ఈ ఆర్థిక శక్తి ని ఇచ్చింది గత కాంగ్రెస్ ప్రభుత్వాలే అని గుర్తు చేశారు. ఐటీ మొదలు మెట్రో వరకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఒఆర్‌ఆర్ వరకు హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన జరిగింది.గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే అని గుర్తు చేశారు. 2013లో అప్పటి యుపిఎ ప్ర భుత్వం ప్రకటించిన ఐటిఐఆర్ ప్రాజెక్ట్ కార్యాచరణలోకి వచ్చి ఉంటే హైదరాబాద్ ముఖచిత్రం మరింతగా మారిపోయేదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఆ వైభవాన్ని తిరిగి తీసుకువచ్చే దిశగా ఆలోచన చేస్తోందని వెల్లడించారు.

యువతకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం
ఏడాది లోపు తమ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తుందని గవర్నర్ వెల్లడించారు. ఆరు నెలల్లో మెగా డిఎస్‌సి నిర్వహించి, ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యువతకు ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చుతామని గవర్నర్ స్పష్టం చేశారు. రైతులు, పేదలు, ఎస్‌సి,ఎస్‌టి, బిసి, మైనార్టీ, మహిళ, యువత, అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికులు ఇలా ప్రతీ వర్గా న్ని పరిగణనలోకి తీసుకుని సంక్షేమం, అభివృద్ధి కార్యాచరణ ఉంటుంది. యువత జాబ్ క్యాలెండర్ విషయంలో చెప్పిన మాట ప్రకారం కార్యాచరణ ఉంటుందని గవర్నర్ స్పష్టం చేశారు.

ఇల్లు నిర్మించుకునే పేదలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం, ఇండ్లు నిర్మించుకునే ఎస్‌సి, ఎస్‌టిలకు రూ.6 లక్షల ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్‌గా మారుస్తామని వెల్లడించారు. వ్యవసాయానికి 24 గంటల విద్యు త్ ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో అవినీతిపై విచారణ జరిపిస్తామని, కృష్ణా జలాల్లో రాష్ట్రానికి దక్కాల్సిన వాటా సాధనకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా సాధించాలనేది తమ ప్రభుత్వ సంకల్పమని తమిళిసై పేర్కొన్నారు. మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. ప్రాణహిత -చేవెళ్ళ ప్రాజెక్టును పూర్తి చేసి ఆదిలాబాద్ సహా పలు జిల్లాలకు సాగునీరు ఇస్తామన్నారు.

అప్రజాస్వామిక పోకడలను ప్రజలు సహించరు
పదేళ్ల నిర్బంధపు పాలన నుండి విముక్తి కావాలని, తమ బతుకుల్లో గొప్ప మార్పు రావాలని కోరుకున్న తెలంగాణ ప్రజలు ఇటీవల ఎన్నికల్లో ఆ దిశగా సుస్పష్టమైన తీర్పు ఇచ్చారని, వారి విజ్ఞతను అభినందిస్తున్నానని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో తెలంగాణ స్వేచ్చావాయువులను పీల్చుకుంటోందని, నియంతృత్వ పాలన, పోకడల నుండి తెలంగాణ విముక్తి పొందిందని చెప్పారు. నిర్బంధాన్ని సహించబోమని విస్పష్టమైన ప్రజాతీర్పు ద్వారా వెల్లడైందని, ఈ తీర్పు పౌరహక్కులకు, ప్రజాస్వామ్య పాలనకు నాంది అయ్యిందని పేర్కొన్నారు. పాలకులకు, ప్రజలకు మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలిగిపోయాయి…అడ్డుగోడలు, అద్దాల మేడలు పటాపంచలై.. ప్రజా ప్రభు త్వ ప్రస్థానం మొదలైందని చెప్పడానికి గర్విస్తున్నానని గవర్నర్ పేర్కొన్నారు.

ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవకులే.. పాలకులు కాదు
ప్రజా ప్రతినిధులు ప్రజలకు సేవకులే తప్ప పాలకులు కాదు అని, పెత్తందార్లు అంతకంటే కాదు అని ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయకముందే రేవంత్‌రెడ్డి చెప్పారని గవర్నర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజలు వారి ఆవేదన, బాధలు, కష్టాలు, సమస్యలు చెప్పుకునేందుకు అందుబాటులో ఉండే పాలన రాష్ట్రంలో మొదలైందని చెప్పారు. ఇది సామాన్యుడి ప్రభుత్వంగా దేశానికే ఆదర్శంగా మారబోతుందని తెలిపారు. ప్రజావాణి ద్వారా వస్తున్న ఫిర్యాదుల్లో ఎక్కువగా భూమికి సంబంధించినవే ఉన్నాయని పేర్కొన్నారు. ధరణి స్థానంలో సమగ్రమైన భూమాత వస్తుందని వెల్లడించారు. ప్రభుత్వ భూముల్ని కాపాడడానికి లాండ్ కమిషన్ ఏర్పాటవుతుందని చెప్పారు. డ్రగ్స్ భూతాన్ని రాష్ట్ర పొలిమేరలు దాటే వరకు తరిమికొట్టేందుకు ప్రభుత్వం ధృడ సంకల్పంతో చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

గత ప్రభుత్వంలో విద్యుత్ వ్యవస్థలు రూ. 81,516 కోట్ల అప్పుల్లో కూరుకుపోవడమే కాకుండా రూ. 50,275 కోట్ల మేర నష్టాల్లో ఉన్నాయని తెలిపారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సైతం రూ. 56 వేల కోట్ల అప్పులు, రూ. 11 వేల నష్టాల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రతీ శాఖను గత ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందని, కార్పొరేషన్ల పేరుతో విచ్చలవిడి రుణాలు తెచ్చి అప్పులమయం చేసి ఆర్థిక క్రమశిక్షణ లేకుండా చేసిందని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. దివాలాతీసిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడం ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సవాల్ అని అన్నారు. దుబారా, దుర్వినియోగం ఎక్కడ జరిగిందో కనిపెట్టే పని మొదలైందని తెలిపారు. వ్యక్తి ఆరాధన ప్రజాస్వామ్యానికి శోభనివ్వదని, దీన్ని మార్చాలని ప్రభుత్వం సంకల్పించిందని చెప్పారు. సచివాలయం అలంకారప్రాయం కాదు.. తెలంగాణ పాలన రాచరికం కాదు.. ప్రజాస్వామ్యం అనే విశ్వాసాన్ని ప్రజలకు కల్పిస్తామని స్పష్టం చేశారు.

అంబేద్కర్ వ్యాఖ్యలను ప్రస్తావించిన గవర్నర్
“ప్రజాస్వామ్యం అనేది కేవలం ఒక ప్రభుత్వపాలనా రూపం మాత్రమే కాదు…వాస్తవానికి అది తోటి మానవుల పట్ల గౌరవాదరాలతో కూడిన ఒక వైఖరి” అన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యాఖ్యలను గవర్నర్ ప్రస్తావించారు. కాళోజీ కవితతో ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్ కాళోజీ నారాయణరావు కవితతో గవర్నర్ తమిళిసై తన ప్రసంగం ప్రారంభించారు. “మూడు కోట్ల మేటి ప్రజల.. గొంతొక్కటి కోరికొక్కటి.. తెలంగాణ వెలసి నిలిచి.. ఫలించాలి భారతాన” అని కాళోజీ పలుకులతో ప్రసంగాన్ని మొదలుపెట్టిన గవర్నర్ తమిళిసై… “ఆ చల్లని సముద్ర గర్భం.. దాచిన బడబానలమెంతో.. ఆ నల్లని ఆకాశంలో.. కానరాని భాస్కరులెందరో”.. అనే దాశరధి గేయంతో ముగించారు. అంతకుముందు గవర్నర్ తమిళసైకి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు స్వాగతం పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News