Wednesday, January 22, 2025

కనీస సౌకర్యాలకు కూడా బడంగ్‌పేట్ ప్రజలు నేటికి నోచుకోకపోవడం దారుణం

- Advertisement -
- Advertisement -

బాలాపూర్: అభివృద్ధి పేరిట పార్టీలు మారిన రాష్ట్ర మంత్రి,మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితఇంద్రారెడ్డి,బడంగ్‌పేట్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాతనర్సింహ్మారెడ్డిలు ఇక్కడి ప్రజలకు కనీసం రోడ్లు,డ్రైనేజి సౌకర్యాలను నేటికి కల్పించలేకపొవడం దారుణం అని బిజెపి నియోజకవర్గం ఇన్‌ఛార్జ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందెల శ్రీరాములయాదవ్ మండిపడ్డారు.మహా జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా 31వ డివిజన్‌లోని గ్రీన్ రిచ్ కాలనీ నుండి 19వ డివిజన్‌లో గల లోకాయుక్తకాలనీ వరకు 4వ రోజు ఆదివారం శ్రీరాములుయాదవ్ గడపగడపకు పాదయాత్ర కొనసాగింది.గెలుపొందిన పార్టీలు మారిన మంత్రి,మేయర్లు నియోజకవర్గం ప్రజల పట్ల నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు.

అదేవిధంగా రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకర్గంలోని ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామి ఇచ్చారు.అంతకు ముందు మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని బోనాలతో శ్రీరాములుయాదవ్‌కు ఘనంగా స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ బిజెపి అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకట్‌రెడ్డి,ఆర్‌కెపురం డివిజన్ కార్పొరేటర్ రాధాధీరజ్‌రెడ్డి,స్ధానిక కార్పొరేటర్లు తోట శ్రీధర్‌రెడ్డి,రామోజి అమితశ్రీశైలంచారి,గౌర రమాదేవిశ్రీనివాస్,బంగారు అనితప్రభాకర్,నిమ్మల సునీతశ్రీకాంత్‌గౌడ్,రామిడి మాధురివీరకర్ణారెడ్డి,దడిగె శంకర్‌కురుమ,గడ్డం లకా్ష్మరెడ్డి,నాయకులు గుర్రం మల్లారెడ్డి,సామ సంజీవరెడ్డి,మద్ది రాజశేఖర్‌రెడ్డి,ఏనుగు ప్రభాకర్‌రెడ్డి,తర్రె మల్లేష్‌యాదవ్,రామిడి శూరకర్ణారెడ్డి,రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి,మమత ఆనంద్,లీలారవినాయక్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News