Monday, December 23, 2024

మణిపూర్ ఘటనపై ప్రధాని స్పందించకపోవడం సిగ్గుచేటు

- Advertisement -
- Advertisement -
టిపిసిసి అధికార ప్రతినిధి పాల్వాయి స్రవంతి

హైదరాబాద్ : మణిపూర్‌లో అల్లకల్లోలం జరుగుతున్నా ప్రధాని స్పందించకపోవడం సిగ్గుచేటనీ టిపిసిసి అధికార ప్రతినిధి పాల్వాయి స్రవంతి ఆరోపించారు. మణిపూర్ కల్లోలం గతంలో రాజస్థాన్, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాల్లో కంటే తక్కువేననడం ప్రధానమంత్రికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి కనపడుతుందన్నారు. బిజెపి మహిళా మంత్రి స్మృతి ఇరానీకి గాంధీ కుటుంబంపై వ్యాఖ్యలు చేయడంలో ఉన్న ఆసక్తి మణిపూర్ ఘటనపై లేదన్నారు. ఈ సంఘటనపై బిజెపిలో ఉన్న మహిళా నాయకత్వం ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆమె సూచించారు. దేశంలో మణిపూర్ ఘటనపై ఇప్పటికైనా బిజెపి మహిళా నాయకత్వం స్పందించాలని, సరిహద్దుల్లో దేశాన్ని కాపాడే సైనికుడి కుటుంబానికే రక్షణ కరువయ్యిందన్నారు.
కేంద్రం వెంటనే స్పందించాలి: బండి
టిపిసిసి అధికార ప్రతినిధి, బండి సుధాకర్ మాట్లాడుతూ మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న ఘటనలపై వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. మణిపూర్‌లో జవాన్ భార్యపై జరిగిన దాడిని దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలన్నారు. మణిపూర్‌లో ఆదివాసీ ప్రజలకు స్వేచ్ఛను కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News