Tuesday, December 24, 2024

కాంగ్రెస్ పార్టీని 420 అనడం ఆశ్యర్యంగా ఉంది

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ నాయకులపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం

మనతెలంగాణ/హైదరాబాద్: నెల రోజుల్లోనే హామీలను అమలు చేయలేదని కాంగ్రెస్ పార్టీని 420 అని కెటిఆర్ అనడం ఆశ్చర్యంగా ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీలో సీఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. దళితుడిని సిఎం చేస్తానని చెప్పి కెసిఆర్ మొదటగా దళితులను మోసం చేశారని ఆయన మండిపడ్డారు. అనంతరం దళితులకు మూడు ఎకరాల భూమి అని మోసం చేశారని, ఇలా మీరిచ్చిన హామీలను ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని బిఆర్‌ఎస్ నాయకులపై ఆయన ధ్వజమెత్తారు.

‘తొమ్మిదేళ్లలో నగరంలో తప్ప ఎక్కడైనా ఇళ్లు కట్టారా?’ అంటూ బిఆర్‌ఎస్ నాయకులను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, అలాగే దరఖాస్తులు తీసుకుంటున్నామన్నారు. గిరిజనులను, దళితులను మోసం చేసిందే బిఆర్‌ఎస్ అని జీవన్ రెడ్డి విమర్శలు చేశారు. బిఆర్‌ఎస్ పేరు పెట్టి తెలంగాణ పదాన్ని ఉచ్ఛరించే నైతిక హక్కు బిఆర్‌ఎస్ కోల్పోయిందని ఆయన మండిపడ్డారు. సమాజంలో అట్టడుగు వర్గాలు అయిన దళితులను మోసం చేసింది బిఆర్‌ఎస్ అని ఆయన ఆరోపించారు. ఎస్టీ రిజర్వేషన్లు, రాష్ట్ర పరిధిలో ఉన్న అంశంలో ఇందిరా సహానీ కేసు అని 8 ఏళ్లు కాలయాపన చేశారని ఆయన ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News