Thursday, January 23, 2025

పాఠశాల అభివృద్ధికి దాతలు ముందుకు రావడం అభినందనీయం

- Advertisement -
- Advertisement -
  • కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు ముం దుకు వచ్చి పాఠశాలలో అభివృద్ధి పనులు చేయడం అభినందనీయమని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలం పూడూరు గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైకిల్ ఫౌండేషన్ వారి సహకారంతో రూపాయలు 30 లక్షలు, మజ్జిగ తిరుపతిరెడ్డి రూ.4 లక్ష లు వెచ్చించి పాఠశాల భవనానికి మరమ్మతులు చేయడంతో పాటు రంగులు వేయించారు.

పాఠశాలలోని మరుగుదొడ్లను ఆధునికరించారు. మంత్రి మల్లారెడ్డి పాల్గొని సోమవారం పాఠశాల భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భ ంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల బలోపేతంకు కృషి చేస్తుందని అన్నారు. నాణ్యమైన విద్యను అందించేందుకు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యార్థులకు బంగారు భవిష్యత్తును ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని మౌలిక వసతులను కల్పించాలని పాఠశాలలో విద్యార్థులు కూర్చునేందుకు బెంచులను ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. పాఠశాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దినందుకు సెహగల్ ఫౌండేషన్ ప్రతినిధులను ప్రత్యేకంగా మంత్రి మల్లారెడ్డి అభినందించారు. అనంతరం గ్రామ సర్పంచ్ బాబు మాట్లాడుతూ పాఠశాలను తీర్చిదిద్దేందుకు మొదటగా సెగల్ ఫౌండేషన్ వారికి అందించాల్సిన 4 లక్షల రూపాయలను అదే గ్రామానికి చెందిన మజ్జిగ తిరుపతిరెడ్డి ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు సర్పంచి తెలిపారు.

సర్పంచ్ బాబు యాదవ్ తన సొంత డబ్బులతో ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు విద్యార్థులకు షూస్ లను పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహ్వానితులను ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ రజిత రాజమల్లారెడ్డి, జడ్పిటిసి శైలజ విజయనందరెడ్డి, బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు దయానంద్ యాదవ్, సైహగల్ ఫౌండేషన్ ప్రతినిధులు వైస్ ఎంపీపీ గోపాని వెంకటేష్, ఎంపీటీసీ నిరుడి రఘు, ఉప సర్పంచ్ మానేపల్లి వెంకటేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ రెడ్డి, వార్డు సభ్యులు రేగు ఉమారాణి నాగేష్, నీరుడు కవితా దేవేందర్, తులసి రేణుక శ్రీనివాస్, శశి కుమార్ యాదవ్, హనుమంత్ రెడ్డి, పుట్నాల శ్రీకాంత్, తపాల మాణిక్యం పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ తపాలా మాధవి నాయకులు శ్రీకాంత్ రెడ్డి, దుండిగళ్ళ శంకర్, యాటవెళ్లి మైపాల్ రెడ్డి, డప్పు కృష్ణ, కోళ్ల వెంకటేష్, గాదం రాములు యాదవ్, చిన్న యాదవ్, బాలనందం, బక్క నాగరాజ్, మరి చెట్టు ప్రసాద్, ఇటబోయిన అనిల్ యాదవ్, బక్క శేఖర్, కోళ్ల హరిబాబు, దేవక వెంకటేష్, గ్రామస్తులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News